Share News

Diksuchi : మ్యాట్‌ నోటిఫికేషన్‌

ABN , Publish Date - Jul 19 , 2024 | 02:15 AM

ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ఏఐఎంఏ)-మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(మ్యాట్‌) 2024 ఆగస్టు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Diksuchi : మ్యాట్‌ నోటిఫికేషన్‌

ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ఏఐఎంఏ)-మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(మ్యాట్‌) 2024 ఆగస్టు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా దేశంలోని ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లు అందిస్తున్న మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంబీఏ, పీజీడీఎం, ఎంఎంఎస్‌ తదితర ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్స్‌ పొందవచ్చు. మ్యాట్‌ను ఇంటర్నెట్‌ బేస్డ్‌ టెస్ట్‌, పేపర్‌ బేస్డ్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానాల్లో నిర్వహిస్తారు. వీటిలో ఒకదాన్ని లేదా రెంటిని అభ్యర్థులు ఎంచుకోవచ్చు. పీబీటీ, సీబీటీలకు పరీక్ష కేంద్రాలు వేరుగా ఉంటాయి.

అర్హత: గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఏదేని డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.

మ్యాట్‌ వివరాలు: దీనిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌, ఇంటెలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్‌, మేథమెటిక్‌ స్కిల్స్‌, డేటా అనాలిసిస్‌ అండ్‌ సఫిషియెన్సీ, ఎకనామిక్‌ అండ్‌ బిజినెస్‌ ఎన్విరాన్‌మెంట్‌ అనే అయిదు సెక్షన్‌లు ఉంటాయి. సెక్షన్‌కు 30 ప్రశ్నలు చొప్పున మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు.

ఐబీటీ షెడ్యూల్‌: ఆగస్టు 14న ఎగ్జామ్‌ రాయాలనుకొనేవారు ఆగస్టు 9లోపు, ఆగస్టు 23న పరీక్ష రాయాలంటే ఆగస్టు 18లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎగ్జామ్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ తరవాత రెండోరోజు నుంచి అడ్మిట్‌ కార్డ్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

సీబీటీ షెడ్యూల్‌

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 11

  • అడ్మిట్‌ కార్డ్‌ల డౌన్‌లోడింగ్‌: ఆగస్టు 14 నుంచి

  • పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ

  • సీబీటీ టెస్ట్‌ తేదీ: ఆగస్టు 18

పీబీటీ షెడ్యూల్‌

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 18

  • అడ్మిట్‌ కార్డ్‌ల డౌన్‌లోడింగ్‌: ఆగస్టు 21 నుంచి

  • పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం

  • పీబీటీ టెస్ట్‌ తేదీ: ఆగస్టు 25

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: ఒక టెస్ట్‌(ఐబీటీ/పీబీటీ/సీబీటీ)నకు రూ.2100; రెండు టెస్ట్‌లు అంటే డబుల్‌(ఐబీటీ/పీబీటీ/సీబీటీ) లేదా (పీబీటీ+ఐబీటీ)/ (పీబీటీ+సీబీటీ)/(సీబీటీ+ఐబీటీ)లకు రూ.3,600.

వెబ్‌సైట్‌: mat.aima.in

Updated Date - Jul 19 , 2024 | 02:16 AM