Share News

Diksuchi : ఐఐఎఫ్‌టీలో ఆన్‌లైన్‌ పీజీ డిప్లొమా

ABN , Publish Date - Jul 19 , 2024 | 02:08 AM

ఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(ఐఐఎ్‌ఫటీ)- ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఈపీజీడీఎం) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

Diksuchi : ఐఐఎఫ్‌టీలో ఆన్‌లైన్‌ పీజీ డిప్లొమా

ఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(ఐఐఎ్‌ఫటీ)- ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఈపీజీడీఎం) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇది 15 నెలల వ్యవధి గల వీకెండ్‌ ప్రోగ్రామ్‌. ఇందులో మూడు సెమిస్టర్లు ఉంటాయి. మొదటి రెండు సెమిస్టర్లు పూర్తయిన తరవాత ప్రోగ్రామ్‌లో బ్రేక్‌ తీసుకోవచ్చు. గరిష్ఠంగా మూడేళ్లలో ప్రోగ్రామ్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్‌ని వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు ప్రత్యేకించారు. దీనిని ఆన్‌లైన్‌ మోడ్‌లో నిర్వహిస్తారు. వారాంతాల్లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు సెషన్స్‌ ఉంటాయి. ప్రోగ్రామ్‌లో భాగంగా పోర్ట్‌ విజిట్‌, ఇండస్ట్రీ విజిట్‌, రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌, అసైన్‌మెంట్స్‌ ఉంటాయి. సెలెక్షన్‌ కమిటీ నిర్ణయం మేరకు అకడమిక్‌ మెరిట్‌, అనుభవం ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు.

అర్హత: గుర్తింపు పొందిన కళాశాల నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం అయిదేళ్ల ప్రొఫెషనల్‌ అనుభవం ఉండాలి. పనిచేస్తున్న సంస్థ నుంచి నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠ వయోపరిమితి నిబంధనలు లేవు.

దరఖాస్తు ఫీజు: రూ.2,000

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31

అడ్మిషన్‌ పొందిన అభ్యర్థుల జాబితా విడుదల: ఆగస్టు 20

ప్రోగ్రామ్‌ ప్రారంభం: సెప్టెంబరు 14 నుంచి

వెబ్‌సైట్‌: WWW.iiftac.in

Updated Date - Jul 19 , 2024 | 02:08 AM