Share News

NEET UG Breaking: పరీక్ష కేంద్రాల వారీగా ఇలా చూడండి..!!

ABN , Publish Date - Jul 20 , 2024 | 12:46 PM

సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శనివారం నీట్ యూజీ 2024(NEET-UG 2024) ఫ‌లితాల‌ను విడుదల చేసింది. ఈ వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.

NEET UG Breaking: పరీక్ష కేంద్రాల వారీగా ఇలా చూడండి..!!

ఢిల్లీ: సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శనివారం నీట్ యూజీ 2024(NEET-UG 2024) ఫ‌లితాల‌ను విడుదల చేసింది. ఈ వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. నీట్ యూజీ ఫ‌లితాల‌ను ఈ లింక్‌లో చూడవచ్చు. సైట్‌లోకి వెళ్లాక దరఖాస్తు సంఖ్య, వ్యక్తిగత వివరాలు ఇచ్చి సబ్‌మిట్ కొడితే ఫలితాలు కనిపిస్తాయి.

ప‌రీక్ష కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫ‌లితాల‌ను వెల్లడించాలని ఎన్టీఏకు సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలను రిలీజ్ చేశారు. ప్రతి సెంటర్, ప్రతి నగరానికి సంబంధించిన ఫలితాలను జులై 20 మధ్యాహ్నం 12 గంటల లోపు రిలీజ్ చేయాల‌ని సుప్రీం గడువు విధించింది.


అయితే అభ్యర్థుల గుర్తింపును మాత్రం గోప్యంగా ఉంచాలని సూచించింది. నీట్‌-యూజీలో అక్రమాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ పీబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.

పరీక్ష పవిత్రత దెబ్బతిందని బలమైన సాక్ష్యం చూపిస్తే నీట్ పరీక్ష మళ్లీ నిర్వహిస్తామని కోర్టు స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజీపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇదే అంశంపై లోక్ సభ, రాజ్యసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. రానున్న బడ్జెట్ సమావేశాల్లోనూ సభలో చర్చకు ఇదే ప్రధానాంశంగా మారే అవకాశం ఉంది.


ఇలా చెక్ చేసుకోండి..

1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

2. హోమ్‌పేజీలో నీట్ పరీక్ష రాసిన నగరం, కేంద్రాల వారీ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.

3. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. రాష్ట్రం, కేంద్రాన్ని ఎంచుకోండి.

4. ఫలితం స్క్రీన్‌పై ప్రదర్శితమవుతుంది.

Updated Date - Jul 20 , 2024 | 12:50 PM