Share News

ABN Big Debate With CBN: ‘ఏబీఎన్‌ బిగ్ డిబేట్‌’లో తొలిసారి చంద్రబాబు.. ఆర్కే చర్చను లైవ్‌లో వీక్షించండి

ABN , First Publish Date - May 08 , 2024 | 07:56 PM

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ ఎన్నో ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మదిలో మెదులుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో సమాధానం ఇచ్చారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక‌ృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన సూపర్ ఎక్స్‌క్లూజివ్ ‘బిగ్ డిబేట్‌’ ప్రత్యక్షంగా వీక్షించండి.

ABN Big Debate With CBN: ‘ఏబీఎన్‌ బిగ్ డిబేట్‌’లో తొలిసారి చంద్రబాబు.. ఆర్కే చర్చను లైవ్‌లో వీక్షించండి

Live News & Update

  • 2024-05-08T21:34:24+05:30

    40 ఏళ్లలో భువనేశ్వరి తొలిసారి రోడ్డుపైకి వచ్చారు: చంద్రబాబు

    • ఈ మధ్య కొన్నిసార్లు ఆవేశంలో మాట తూలుతున్నాను

    • నాకు జరిగిన అవమానాలు దేశంలో ఎవరికీ జరగలేదు

    • ఫ్రస్ట్రేషన్‌లో కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తోంది

  • 2024-05-08T21:20:52+05:30

    నేను ఏం చేస్తానో జూన్‌ 4 తర్వాత చూస్తారు: చంద్రబాబు

    • నేను తప్పు చేయకుండా శిక్ష అనుభవించా...

    • నేను తప్పు చేయలేదని జనం నమ్మారు

    • 53 రోజులు జైల్లో ఉంటే విదేశాల్లోనూ జనం ఉద్యమించారు

    • ఇంతగా నమ్మిన జనం కోసమే జీవితాంతం పనిచేస్తా

    • ఒక వ్యక్తినే నేను టార్గెట్‌ చేయను

  • 2024-05-08T21:17:24+05:30

    నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు అండగా నిలబడ్డారు
    • అంతకంటే నాకు ఇంకేం కావాలి

    • అన్నిచోట్లా తెలుగుజాతి నంబర్‌వన్‌గా ఉండాలి

    • పేదరికం లేని తెలుగు జాతే నా లక్ష్యం

    • 45 ఏళ్లలో ప్రలోభాలకు లొంగలేదు

    • సంతకం పెట్టాక కూడా మళ్లీ చెక్‌ చేసుకునేవాడ్ని

  • 2024-05-08T21:08:45+05:30

    • నేను చెప్పివన్నీ హైదరాబాద్‌లో సాధ్యమయ్యాయి: చంద్రబాబు

    • ప్రజలు నన్ను గుర్తు పెట్టుకునేలా పని చేస్తా

    • హైదరాబాద్‌ను ఎవరూ నాశనం చేయలేదు

    • అందుకు చాలామంది సీఎంలకు కృతజ్ఞత చెప్పాలి

    • నాకు ఎంత సాధ్యమైతే అంత చేస్తా

    • జీవితంలో ఊహించని అనుభవాలు ఎదురయ్యాయి

    • హైదరాబాద్‌లో నేను చేసిన అభివృద్ధి పనుల ఫలితాలు..

    • తెలంగాణ వాసులు అనుభవిస్తున్నారు

    • అదేవిధంగా అమరావతిలో చేయాలనుకున్నా కానీ ప్రజలు అర్థం చేసుకోలేదేమో?

  • 2024-05-08T21:03:43+05:30

    Untitled-6.jpg

    అలాంటి వారికి పెన్షన్‌ కచ్చితంగా ఇవ్వాలి: చంద్రబాబు

    • పరిస్థితులకు తగ్గట్టు మనం కూడా మారాలి

    • కొన్ని వృత్తుల్లో ఉన్న వారికి 50 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలు వస్తాయి

    • అలాంటి వారికి పెన్షన్‌ కచ్చితంగా ఇవ్వాలి

    • సామాజిక, ఆర్థిక కారణాలతో కొంతమంది జీవితాంతం వెనుకబడ్డారు

    • ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాల్లోని కొంతమంది వెనుకబడ్డారు

    • వారి ఆదాయం కూడా పెరిగేలా చేస్తాం

    • అందుకోసమే పీ4 పాలసీ అంటున్నాం

  • 2024-05-08T20:55:32+05:30

    ఉద్యోగులకు గతంలో ముఖ్యమంత్రులు భయపడ్డారు: చంద్రబాబు
    • జగన్‌ పాలనలో ఉద్యోగులే భయపడుతున్నారు

    • జగన్‌ మళ్లీ వస్తే రివర్స్‌ పీఆర్‌సీ అంటాడు

    • నేను గతంలోనూ సంక్షేమ పథకాలు ఇచ్చా

    • జగన్‌ అభివృద్ధిని ఆపేసి సంక్షేమ చేసుకుంటూ వెళ్తున్నాడు

    • అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ వెళ్లాలి

  • 2024-05-08T20:45:58+05:30

    2014లోనూ నేనెప్పుడూ పదవులు అడగలేదు: బిగ్‌డిబేట్‌లో చంద్రబాబు

    • జగన్‌ కాళ్లు మొక్కి కేసులు మాఫీ చేయించుకుంటాడు

    • జగన్‌ మాటల్లో చాలా వ్యత్యాసం వచ్చింది

    • గతంలో తనను ఎవరూ టచ్‌ చేయలేరన్నారు

    • ఇప్పుడేమో తనను ఓడిస్తారంటున్నాడు

    • జగన్‌ మళ్లీ గెలిచే ప్రసక్తే లేదు

    • జగన్‌ మళ్లీ వస్తాడని నాకు నమ్మకం లేదు

  • 2024-05-08T20:43:54+05:30

    • రాష్ట్రం కోసమే కేంద్రంలో అధికారంలో ఎన్టీఆర్‌ చేరలేదు: చంద్రబాబు

    • తెలుగు జాతే ముఖ్యమని ఎన్టీఆర్‌ అన్నారు

  • 2024-05-08T20:40:22+05:30

    బిగ్‌డిబేట్‌లో మోదీపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు

    • దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదు

    • మోదీపై దేశ ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది

    • ప్రపంచంలోనే లీడర్‌షిప్‌ లోటు ఉంది

    • అదే సమయంలో మోదీ లీడర్‌గా ఎదిగారు

    • మన దేశాన్ని మోదీ ప్రమోట్‌ చేశారు

  • 2024-05-08T20:32:42+05:30

    అందుకే మూడు పార్టీలు కలిశాయి: బిగ్‌డిబేట్‌లో చంద్రబాబు

    • రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని మోదీ, అమిత్‌షా హామీ ఇచ్చారు

    • గతంలో వాజ్‌పేయ్‌ కూడా నాకు సహకరించారు

    • పాలసీల్లో మోదీ కచ్చితంగా సహకరిస్తారు

    • గతంలో ఒక ఇష్యూపై మోదీతో విభేదించా

    • ప్రత్యేక హోదా రాలేదని ఆందోళన కలిగింది

    • విభజన కంటే జగన్‌ పాలనలో ఎక్కువ నష్టం కలిగింది

    • ఇప్పుడు రాష్ట్రాన్ని పునర్‌ నిర్మించడమే మా లక్ష్యం

    • దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదు

    • మోదీపై దేశ ప్రజలకు నమ్మకం ఉంది

  • 2024-05-08T20:28:46+05:30

    జనం కోసం మూడు పార్టీలు కలిశాయి: బిగ్‌డిబేట్‌లో చంద్రబాబు

    • రాష్ట్రాన్ని బాగు చేస్తామన్న నమ్మకం మాకుంది

    • రాష్ట్రంలో వైసీపీ పాలనలో అవినీతి విపరీతంగా పెరిగింది

    • దాదాగిరి పెరిగింది.. రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది

    • పోలవరం, అమరావతి, పరిశ్రమల్ని సర్వనాశనం చేశారు

  • 2024-05-08T20:25:33+05:30

    Untitled-4.jpg

    • దేశంలో ఏ పార్టీ కూడా మీడియా సంస్థలు పెట్టలేదు: చంద్రబాబు

    • ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేయడానికే పేపర్‌ పెట్టారు

    • ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేశారు

    • జీవితంలో కొందరు ఊహకు అందరు

    • ఇలాంటి వ్యక్తి పుడతాడని ఎవరూ ఊహించలేదు

    • జగన్‌ను తండ్రి ఎందుకు బెంగళూరుకు పంపించాడు?

    • జగన్‌ను మేం తక్కువ అంచనా వేశాం

    • జగన్‌ను అంచనా వేయలేకపోవడం వైఫల్యమే

  • 2024-05-08T20:20:37+05:30

    • ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతా: బిగ్‌డిబేట్‌లో చంద్రబాబు

    • 45ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా..చాలా పార్టీల్ని, చాలామంది సీఎంలను చూశా

    • రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు

    • అబద్ధాలు చెప్తూ జనాన్ని నమ్మించారు

  • 2024-05-08T20:19:22+05:30

    • ఇలాంటి వ్యక్తి పుడతారని ఎవరూ అనుకోరు: జగన్‌పై చంద్రబాబు ఫైర్

    • జగన్‌ను అంచనా వేయలేకపోవడమే వైఫల్యమే

    • రాష్ట్రంలో దాదా గిరి పెరిగింది.. నష్టం జరిగింది

  • 2024-05-08T20:17:32+05:30

    గతంలో ఒక విషయంలో మోదీతో విభేధించాను

    విధానపరంగా మోదీ ఖచ్చితంగా సహకరిస్తారు

    గతంలో వాజ్‌పేయీ కూడా సహకరించారు

  • 2024-05-08T20:14:45+05:30

    • 45 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాను.

    • ఫేక్‌న్యూస్ ప్రచారం చేయడానికి పేపర్ పెట్టారు. జీవితంలో కొందరు ఊహకు అందరు.

    • జగన్‌ను తండ్రి ఎందుకు బెంగళూరు పంపించారు?.

    • జనం కోసం మూడు పార్టీలు కలిశాయి

    • రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది

    • పోలవరం, అమరావతిని సర్వనాశనం చేశారు

  • 2024-05-08T20:07:51+05:30

    ముఖ్యమంత్రిగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెడతా: బిగ్ డిబేట్‌లో చంద్రబాబు

  • 2024-05-08T19:55:51+05:30

    జగన్ పతనం.. ఎన్డీయే విజయం తధ్యమని చంద్రబాబు అంత నమ్మకంగా ఎలా చెబుతున్నారు.. జగన్మోహన్ రెడ్డి కుట్రలు, మాయలను తిప్పికొట్టగల అస్త్రాలు చంద్రబాబు దగ్గర ఉన్నాయా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల్లో జగన్ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తుందా.. జగన్ ఏలుబడిలో ధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టే యాక్షన్ ప్లాన్ బాబు దగ్గర ఉందా.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడితే నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంటుంది. కేంద్రంలో మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పుతారా.. అన్ని మంచి శకునాలే అని ధీమాగా ఉన్న చంద్రబాబును ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధమేనా..! ఇలా ఎన్నో ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మదిలో మెదులుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో సమాధానం ఇచ్చారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక‌ృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన సూపర్ ఎక్స్‌క్లూజివ్ ‘బిగ్ డిబేట్‌’ ప్రత్యక్షంగా వీక్షించండి.