Share News

AP Exit Polls 2024 Live Updates: ఏపీ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్ .. ప్రభుత్వం ఎవరిదంటే?

ABN , First Publish Date - Jun 01 , 2024 | 04:30 PM

AP Assembly Exit Polls 2024 Live Updates: 153 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని వైసీపీ అధినేత, సీఎం జగన్ స్వయంగా ప్రకటించుకున్నారు. తగ్గేదేలే.. కచ్చితంగా అధికారం తమదేనని కూటమి నేతలు ఘంటాపథంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జనాల నాడిని అంచనా వేసిన పలు పోల్ సంస్థలు, సర్వే ఏజెన్సీలు మరికొద్ది సేపట్లో ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించబోతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం షరతు ప్రకారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు రానున్నాయి.

AP Exit Polls 2024 Live Updates:  ఏపీ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్ .. ప్రభుత్వం ఎవరిదంటే?

Live News & Update

  • 2024-06-01T20:59:06+05:30

    • వైసీపీ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది: వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి

    • మహిళలే వైసీపీని మళ్లీ ఆదరించారు

  • 2024-06-01T19:53:47+05:30

    సర్వే ఏజెన్సీ పార్టీ వైసీపీ

    రైజ్ 113-122 48-60

    కేకే సర్వీసెస్ 161 14

  • 2024-06-01T19:32:56+05:30

    ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయి. మెజారిటీ సంస్థ ఎన్డీయే కూటమికి అధికారం దక్కుతుందని చెబుతుండగా.. కొన్ని సర్వేలు వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పాయి.

  • 2024-06-01T19:10:06+05:30

    జన్‌మత్ పోల్స్

    టీడీపీ కూటమి 67-75

    వైసీపీ 95-103

    WRAP Survey

    టీడీపీ కూటమి - 71-81

    వైసీపీ - 94-104

  • 2024-06-01T19:04:31+05:30

    • కడపలో వైఎస్ షర్మిలకు డిపాజిట్ కూడా దక్కదు: ఆరా సర్వే

  • 2024-06-01T19:02:17+05:30

    వైసీపీ తిరిగి అధికారంలోకి రాబోతోంది: ఆరా సర్వే విశ్లేషణ

    • టీడీపీ కూటమికి 71-81 స్థానాలు, వైసీపీకి 94-104 స్థానాలు వస్తాయి

    • 2 శాతం ఓట్ల తేడాతో వైసీపీ గెలుస్తుంది.

    • వైసీపీని తిరిగి ఎన్నుకునేందుకు రాష్ట్రంలో 56 శాతం మంది మహిళలు ఓటు వేశారు

    • మహిళల్లో 42 శాతం మంది మాత్రమే కూటమికి ఓటు వేశారు.

    • పురుషుల్లో వైసీపీకి 45.35 శాతం, 51.56 శాతం మంది కూటమికి ఓటు వేశారు

    • బీసీల్లో కూడా వైసీపీ గణనీయ ఓటు బ్యాంకును సంపాదించుకుంది

  • 2024-06-01T18:51:38+05:30

    • నగరి నుంచి రోజా ఓటమి చవిచూడబోతున్నారు

    • పుంగనూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నారు

  • 2024-06-01T18:50:28+05:30

    • మంత్రి జోగి రమేశ్ పెనమలూరులో గట్టి పోటీ ఎదుర్కొనబోతున్నారు

    • మంత్రి అంబటి రాంబాబుకు గట్టిపోటీ

    • మంత్రి విడుదల రజనీకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గట్టి పోటీ.. స్వల్ప తేడాతో ఓటమికి అవకాశం

    • ఆదిమూలపు సురేశ్ కొండేపి నియోజకవర్గంలో స్వల్ప తేడాతో ఓటిపోవచ్చు

  • 2024-06-01T18:46:29+05:30

    • పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారు: ఆరా సర్వే

    • కుప్పం నుంచి చంద్రబాబు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు

    • నారా లోకేశ్ మంగళగిరి నుంచి గెలవబోతున్నారు

    • నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి గెలవబోతున్నారు

    • పులివెందుల నుంచి వైఎస్ జగన్‌కు భారీ మెజారిటీ: ఆరా సర్వే

  • 2024-06-01T18:43:11+05:30

    పీపుల్స్ పల్స్ (People Pulse)

    కూటమి - 111-135

    వైసీపీ - 45-60

    ఇతరులు - 0

  • 2024-06-01T18:39:07+05:30

    పల్స్ టుడే

    కూటమి 121-129

    వైసీపీ - 45-54

    ఇతరులు - 0

  • 2024-06-01T18:31:38+05:30

    ఒక్కొక్కటిగా విడుదలవుతున్న ఎగ్జిట్ పోల్స్

    చాణక్య స్ట్రాటజీస్ -

    ఎన్డీయే కూటమి - 114 -125

    వైఎస్సార్‌సీపీ - 39 - 49

    ఇతరులు - 1

  • 2024-06-01T18:21:08+05:30

    • లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు

    • ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు

    • ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన పలు మీడియా, సర్వే ఏజెన్సీలు

    • మరి కాసేపట్లోనే ఎగ్జిట్ పోల్స్

  • 2024-06-01T18:14:18+05:30

    ఎగ్జిట్ పోల్స్ కోసం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ ఇక్కడ చూడండి

  • 2024-06-01T18:12:07+05:30

    • దేశవ్యాప్తంగా ముగిసిన లోక్‌సభ ఎన్నికలు

    • ముగిసిన 7వ దశ ఎన్నికలు

    • లోక్‌సభ ఎన్నికలు-2024 పరిసమాప్తం

    • కాసేపట్లో విడుదల కానున్న ఎగ్జిట్ పోల్స్

  • 2024-06-01T17:57:34+05:30

    బెట్టింగ్ రాయుళ్లలో పెరిగిన టెన్షన్!

    • ఎగ్జిట్ పోల్స్‌తో బెట్టింగ్ రాయుళ్ల గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు!

    • మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఏపీలో బెట్టింగ్‌లు

    • అంచనాలకు అందని రీతిలో బెట్టింగ్‌లు

    • కూటమి గెలుస్తుందని వేల కోట్లల్లో బెట్టింగులు

    • వైసీపీ గెలుస్తుందని అంతకుమించి బెట్టింగ్‌లు

    • లక్షకు.. లక్షన్నర, రెండు లక్షలు అంటూ బెట్టింగ్‌లు

  • 2024-06-01T17:24:19+05:30

    Untitled-2.jpg

    2019లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయ్?

    2019లో ఎగ్జిట్ పోల్ అంచనాలను గమనిస్తే..

    1. ఆరా - టీడీపీకి 47-56 సీట్లు, వైసీపీకి 119-126 సీట్లు, జనసేనకు 2 సీట్లు.

    2. ఇండియా టుడే - టీడీపీకి 37-40 సీట్లు, వైసీపీకి 130-135, జనసేనకి 0-1

    3. ఐఎన్ఎస్ఎస్ - టీడీపీకి 118, వైసీపీకి 52, జనసేనకి 5

    4. వీడీపీ అసోసియేట్స్ - టీడీపీకి 54-60, వైసీపీకి 111-121, జనసేనకి 0-4

    5. సీపీఎస్ టీడీపీకి 43-44, వైసీపీకి 130-133, జనసేనకి 0-1 సీటు

  • 2024-06-01T17:02:56+05:30

    6.30 గంటలకు ఎగ్జిట్‌ పోల్స్

    లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్లో ఈ ఫలితాలు వెలువడనున్నాయి. సాయంత్రం 6.30 గంటల నుంచి సర్వే ఏజెన్సీలు, మీడియా సంస్థలు తమ అంచనాలను ప్రకటించనున్నాయి.

  • 2024-06-01T16:45:15+05:30

    ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ?

    ఏపీలో మొత్తం 175 శాసన సభ, 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అధికార వైఎస్సార్‌సీపీ మొత్తం 175 శాసన సభ, 25 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను పోటీ చేయించింది. ఇక ఎన్డీయే కూటమిగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. పొత్తులో భాగంగా టీడీపీ 141 శాసన సభ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా.. జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసింది. ఇక బీజేపీ 13 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసింది. ఇక కాంగ్రెస్, సీపీఐ పార్టీలు ఇండియా కూటమిగా పోటీ చేశాయి.

  • 2024-06-01T16:35:18+05:30

    కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలు

    అయితే కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి గెలుపు ఎవరిదంటే మాత్రం రాజకీయ విశ్లేషకులు సైతం నీళ్లు నమిలారు. ‘చెప్పలేకపోతున్నాం.. అంచనా వేయలేకపోతున్నాం.. లెక్కగట్టలేకపోతున్నాం’ అనే మాటలు ఎక్కువగా వినిపించాయి. అయితే ఇందుకు విభిన్నంగా 153 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని వైసీపీ అధినేత, సీఎం జగన్ స్వయంగా ప్రకటించుకున్నారు. తగ్గేదేలే.. కచ్చితంగా అధికారం తమదేనని కూటమి నేతలు ఘంటాపథంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జనాల నాడిని అంచనా వేసిన పలు పోల్ సంస్థలు, సర్వే ఏజెన్సీలు మరికొద్ది సేపట్లో ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించబోతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం షరతు ప్రకారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు రానున్నాయి.

  • 2024-06-01T16:22:40+05:30

    ఏపీలో ఈసారి టీడీపీ కూటమిదే అధికారమా?. లేక ఓటర్లు మరోసారి వైసీపీకే పట్టం కట్టారా?. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి గెలుచుకునే సీట్లు ఎన్ని?. వైసీపీ ఎన్ని సీట్లకు పరిమితం అవుతుంది?. పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడతారా?. జనసేనకు వచ్చే సీట్లు ఎన్ని?. బీజేపీ కమలం ఎన్ని చోట్ల వికసిస్తుంది?. కడప ఎంపీ స్థానంలో గెలిచి షర్మిల సంచలనం సృష్టిస్తారా?. అమాత్యుల్లో గట్టెక్కేది ఎందరు?... మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇరు తెలుగు రాష్ట్రాల జనాలను తొలచివేసిన ప్రశ్నలు ఇవీ.