Share News

Life Style: ఇలా చేస్తే మేకప్ లేకపోయినా.. మీ ఫేస్ అందంగా కనిపించడం పక్కా..!

ABN , Publish Date - Jun 17 , 2024 | 09:55 AM

మేకప్‌తో ఎన్నో అద్భుతాలు చేయ్యొచ్చు. కానీ మేకప్ వల్ల చర్మం సహజ కాంతిని కోల్పోతుంది. అలాగే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. అయినప్పటికీ అందంగా కనిపించేందుకు ఎక్కువమంది మేకప్ వేసుకుంటారు.

Life Style: ఇలా చేస్తే మేకప్ లేకపోయినా.. మీ ఫేస్ అందంగా కనిపించడం పక్కా..!
Skin Care

మేకప్‌తో ఎన్నో అద్భుతాలు చేయ్యొచ్చు. కానీ మేకప్ వల్ల చర్మం సహజ కాంతిని కోల్పోతుంది. అలాగే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. అయినప్పటికీ అందంగా కనిపించేందుకు ఎక్కువమంది మేకప్ వేసుకుంటారు. మేకప్ లేకుండా అందంగా కనిపించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఆ టిప్స్ పాటిస్తే చాలు మేకప్ లేకుండానే చర్మం మెరిసిపోతుంది. చాలామంది ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం కలిగి ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు మెరిసే చర్మం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. తమ అందానికి మెరుగులు దిద్దడానికి మేకప్ వేసుకుంటారు. కానీ మేకప్ వేసుకోవడం కంటే సహజంగా ముఖ కాంతిని కలిగి ఉండటమే నిజమైన అందం. మేకప్ వల్ల ముఖం ప్లాస్టిక్ పువ్వులా ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ మేకప్ లేకుంటే ఫేస్ సహజమైన, అందమైన పుష్పంలా వికసించినట్లు ఉంటుంది. మీ ముఖం విచ్చుకోవాలంటే దానికి తగినంత ఆక్సిజన్, నీరు లభిస్తే చాలు. తీవ్రమైన జీవనశైలి, నిద్రలేమి, పర్యావరణంలోని కాలుష్య కారకాలు, కాలానుగుణ మార్పుల ఫలితంగా మన చర్మం నిర్జీవంగా, నిస్తేజంగా మారుతుంది. కానీ చింతించాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన, ప్రభావవంతమైన చిట్కాలతో ఆ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

మహిళలలో ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!


మేకప్‌కు దూరంగా..

సహజమైన చర్మ కాంతి పొందాలంటే తరచుగా మేకప్ వేసుకోకూడదు. వారానికి కనీసం ఒకరోజు ముఖానికి ఎలాంటి ఫేషియల్ క్రీమ్‌లు, సౌందర్య సాధనాలను వాడకూడదు. ఇలా ఏమి చేయకుండా ఉండటం వలన ముఖంలో సహజ నిగారింపు వస్తుంది. అయితే బయటకు వెళ్లేటపుడు హానికరమైన సూర్య కిరణాల ప్రభావాల నుండి మీ చర్మాన్ని రక్షించడం కోసం సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించవచ్చు.

ఆడవారిలో కాల్షియం తక్కువ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!


హైడ్రేటెడ్‌గా..

శరీరంలో ప్రతి అవయవానికి, ప్రతి కణానికి నీరు అవసరం. అందుకే తగినంత నీరు తాగడం వలన మొత్తం శరీరానికి వివిధ మార్గాల్లో ప్రయోజనం చేకూరుతుంది, వాటిలో ఒకటి మెరుగైన చర్మం. మీరు హైడ్రేటెడ్ గా ఉంటే మీ ముఖం విచ్చుకుంటుంది. లేదంటే కళావిహీనంగా కనిపిస్తుంది. అందువల్ల నీరు, ఎలక్ట్రోలైట్స్ కలిగిన స్వచ్ఛమైన కొబ్బరినీరు తాగుతుండాలి.


వేడి నీటిని ఉపయోగించవద్దు

ముఖాన్ని వేడి నీటితో కడగడం వల్ల చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచే సహజ నూనెలు తొలగిపోతాయి. వేడి నీరు చర్మాన్ని పొడిగా చేస్తుంది. చర్మం సున్నితమైన సమతుల్యతను దెబ్బతీస్తుంది. మీరు మీ చర్మాన్ని ఎంత బాగా చూసుకుంటారు అనేది మీ ఆరోగ్యం, బిగుతును, ఆకృతిని ప్రభావితం చేస్తుంది.


జాగ్రత్త.. ఈ శబ్దాలు వింటే వినికిడి లోపం రావడం ఖాయం..!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Read More Health News and Latest Telugu News

Updated Date - Jun 17 , 2024 | 09:55 AM