Share News

Taiwan: మరోసారి తైవాన్ సరిహద్దుల్లో చైనా విమానాలు.. యుద్ధం తప్పదా..

ABN , Publish Date - Sep 10 , 2024 | 08:12 AM

చైనా తన దూకుడు చర్యల నుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలోనే మరోసారి చైనా సైన్యం తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. 7 చైనా నౌకాదళ నౌకలు, ఒక అధికారిక నౌక, 17 సైనిక విమానాలు సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 6 గంటల మధ్య తైవాన్ చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Taiwan: మరోసారి తైవాన్ సరిహద్దుల్లో చైనా విమానాలు.. యుద్ధం తప్పదా..
china taiwan

చైనా(china), తైవాన్(Taiwan) దేశాల మధ్య ఉద్రిక్తత క్రమంగా పెరుగుతోంది. చైనా తన దూకుడు చర్యల నుంచి వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలోనే మరోసారి చైనా సైన్యం తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. ఏడు చైనా నౌకాదళ నౌకలు, ఒక అధికారిక నౌక, 17 సైనిక విమానాలు సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల మధ్య తైవాన్ చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో తైవాన్ సైన్యం అప్రమత్తమై స్పందించింది. చైనా కార్యకలాపాలను అడ్డుకునేందుకు తైవాన్ విమానాలు, నౌకాదళ నౌకలు, వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలను మోహరించింది.


17 విమానాలు

తైవాన్ సరిహద్దుకు సమీపంలో చైనా విమానాలు, నౌకాదళ నౌకలు కనిపించాయని తైవాన్ వెల్లడించింది. ఆ క్రమంలో 17 విమానాలలో 12 తైవాన్ జలసంధి మధ్య రేఖ దాటి తైవాన్ ఈస్టర్న్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ (ADIZ)లోకి ప్రవేశించినట్లు తైవాన్ మిలిటరీ నివేదించింది. చైనా, తైవాన్ మధ్య ఈ నీటి ఒప్పందం అనధికారిక సరిహద్దుగా ఉంది. తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ విషయాన్ని తెలిపింది. చైనా చేస్తున్న చర్యలను గమనిస్తూనే ఉన్నామని వెల్లడించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)కి చెందిన 16 విమానాలు తైవాన్ జలసంధి మధ్య రేఖను దాటి తైవాన్ తూర్పు వైమానిక రక్షణ గుర్తింపు జోన్‌లోకి ప్రవేశించాయని తెలిపింది.


గ్రే జోన్ ప్లాన్

అయితే చైనా తైవాన్‌ను తన భాగమని చెబుతుండగా, తైవాన్ మాత్రం తనను తాను సార్వభౌమ దేశమని ప్రకటించుకుంది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు చైనా తైవాన్‌పై నేరుగా దాడి చేయలేదు. కానీ గ్రే జోన్‌ వ్యూహాన్ని అమలు చేస్తుంది. అంటే చైనా నేరుగా యుద్ధం చేయదు. కానీ యుద్ధం చేస్తామని చెప్పకనే చెబుతూ బెదిరింపులకు పాల్పడుతుంది. గ్రే జోన్ అంటే ఒక దేశం నేరుగా దాడి చేయదు. కానీ అలాంటి భయాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తుంది.


దాడి చేసే ఛాన్స్

ఈ క్రమంలో చైనా ప్రత్యక్ష సైనిక చర్యకు బదులుగా, దాడి భయాన్ని సృష్టించే విషయాలు అనేకసార్లు జరుగుతున్నాయి. తైవాన్‌తో చైనా చేస్తున్నది ఇదే. చైనా సెప్టెంబర్ 2020 నుంచి 'గ్రే జోన్' వ్యూహాలను తరచుగా ఉపయోగిస్తోంది. అయితే ఈ చర్యలు మరింత పెరిగితే యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అనేక సార్లు ఇదే వ్యూహాన్ని అమలు చేస్తే ఏదైనా ఒక దేశం ముందడగు చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అలా చేస్తే యుద్ధం తప్పదని చెప్పవచ్చు.


ఇవి కూడా చదవండి:

Apple Watch 10: యాపిల్ వాచ్ 10 సిరీస్ విడుదల.. మెడిసిన్ వేసుకునే రిమైండర్ ఫీచర్‌తోపాటు..

Money Saving Plan: రిటైర్‌ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..

BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కట్టడికి బీఎస్ఎన్ఎల్ పెద్ద ప్లాన్.. టాటా సపోర్ట్‌తో ఇక..


Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..

Read MoreInternational News and Latest Telugu News

Updated Date - Sep 10 , 2024 | 08:14 AM