Share News

Pennsylvania: 17 మందిని చంపిన నర్సుకు 760 ఏళ్ల జైలు!

ABN , Publish Date - May 05 , 2024 | 05:03 AM

అమెరికాలో ఇన్సులిన్‌ డోసు పెంచి 17 మంది మరణానికి కారణమైన నర్సు హీథర్‌ ప్రెస్సిడీ(41)కి పెన్సిల్వేనియా కోర్టు 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Pennsylvania: 17 మందిని చంపిన నర్సుకు 760 ఏళ్ల జైలు!

పెన్సిల్వేనియా, మే 4: అమెరికాలో ఇన్సులిన్‌ డోసు పెంచి 17 మంది మరణానికి కారణమైన నర్సు హీథర్‌ ప్రెస్సిడీ(41)కి పెన్సిల్వేనియా కోర్టు 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రోగుల పట్ల విసుగు చెందడం వల్లనే వారి ప్రాణాలు తీసినట్లు హీథర్‌ విచారణలో అంగీకరించింది. 2020 నుంచి 2023 మధ్యలో మొత్తం 17 హత్య కేసులు ఆమెపై నమోదు కాగా.. కోర్టు మూడు హత్యలు, 19 హత్యాయత్నాల కేసుల్లో హీథర్‌ను దోషిగా తేల్చింది.


వైద్య సిబ్బందే రోగుల ప్రాణాలు తీసిన సంఘటనలు గతంలోనూ అమెరికాలో చోటుచేసుకున్నాయి. న్యూజెర్సీ, పెన్సిల్వేనియాల్లో ఛార్లెస్‌ కల్లెన్‌ అనే వ్యక్తి 29 మంది రోగులకు హై డోస్‌ ఇన్సులిన్‌ ఇచ్చి ప్రాణాలు తీశాడు. టెక్సా్‌సలో ఓ వ్యక్తి నలుగురు రోగుల ధమనుల్లోకి గాలి పంపించి చంపేశాడు.

Updated Date - May 05 , 2024 | 05:03 AM