Share News

Bangkok : డ్రోన్‌ దాడిలో 200 మందికి పైగా రోహింగ్యాల మృతి

ABN , Publish Date - Aug 11 , 2024 | 04:44 AM

మయన్మార్‌ను వీడి పారిపోతున్న రోహింగ్యాలపై జరిగిన డ్రోన్‌ దాడిలో 200 మందికిపైగా మృతి చెందారు. మృతి చెందిన వారిలో పిల్లలతో సహా వెళుతోన్న కుటుంబాలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

Bangkok : డ్రోన్‌ దాడిలో 200 మందికి పైగా రోహింగ్యాల మృతి

  • మయన్మార్‌ నుంచి పారిపోతుండగా ఘటన

బ్యాంకాక్‌, ఆగస్టు 10 : మయన్మార్‌ను వీడి పారిపోతున్న రోహింగ్యాలపై జరిగిన డ్రోన్‌ దాడిలో 200 మందికిపైగా మృతి చెందారు. మృతి చెందిన వారిలో పిల్లలతో సహా వెళుతోన్న కుటుంబాలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మయన్మార్‌లోని రఖినే రాష్ట్రం నుంచి పక్కనున్న బంగ్లాదేశ్‌లోకి వెళ్లేందుకు వీరు సరిహద్దులో వేచివుండగా ఈ దాడి జరిగింది.

చనిపోయినవారిలో ఒక నిండు గర్భిణి, ఆమె రెండేళ్ల కుమార్తె కూడా ఉన్నారు. ఆ మహిళ భర్త మాట్లాడుతూ... నది తీరంలో తామంతా నిలబడి ఉండగా డ్రోన్ల దాడి ప్రారంభమయ్యిందని చెప్పాడు. మయన్మార్‌ సైనిక జంటాకు తిరుగుబాటుదారులకు మధ్య జరుగుతోన్న పోరాటంలో ఇటీవల సాధారణ పౌరులపై జరిగిన అతి పెద్ద దాడి ఇది. అయితే దాడికి మీరు కారణమంటే... మీరే కారణమని సైన్యం, తిరుగుబాటుదారులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.

Updated Date - Aug 11 , 2024 | 04:44 AM