Terror Attack: రైల్వే స్టేషన్లో భారీ పేలుడు.. 25 మంది మృతి..
ABN , Publish Date - Nov 09 , 2024 | 04:01 PM
Blast in Railway Station: పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో రైల్వే స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఉగ్రవాదులు జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి చెందగా.. 46 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 14 మంది సైనికులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
Blast in Railway Station: పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో రైల్వే స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఉగ్రవాదులు జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి చెందగా.. 46 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 14 మంది సైనికులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. బలూచిస్తాన్‌లోని క్వెట్టా ప్రధాన రైల్వే స్టేషన్లో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్ అవుతోంది. పేలుడు తీవ్రంగా ఉండటంతో.. స్టేషన్ ఆవరణ మొత్తం స్మశానంలా మారిపోయింది. ఫ్లాట్‌ఫామ్‌పై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. స్టేషన్ పైకప్పు ఎగిరిపోయింది. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది.
జాఫర్ ఎక్స్‌ప్రెస్ పెషావర్‌కు బయలుదేరే సమయంలో రైల్వే స్టేషన్ బుకింగ్ కార్యాలయంలో ఈ పేలుడు సంభవించిందని అక్కడి అధికారులు ప్రకటించారు. ఆత్మాహుతి దాడిగా నిర్ధారించారు. బలూచ్ లిబరేషన ఆర్మీ(బిఎల్ఏ) ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. భద్రతా దళాలు పేలుడు జరిగిన ప్రాంతాన్ని తమ ఆధీనంలో తీసుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 46 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇన్ఫాంట్రీ స్కూల్లోని ఆర్మీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఈ విధ్వంసానికి పాల్పడినట్లు బలూచిస్తాన్‌లోని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మౌజమ్ జా అన్సారీ తెలిపారు.
బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ విచారణకు ఆదేశించారు. ఉగ్రవాదులను దాడిని తీవ్రంగా ఖండించారు. అమాయక ప్రజలు, కార్మికులు, పిల్లలు, మహిళలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదాలు క్షమార్హులు కాదని, కఠిన చర్యలు తీసుకుంటామని సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. ఇదిలాఉంటే.. పాకిస్తాన్లో ఉగ్రవాదుల దాడులు నానాటికి పెరిగిపోతున్నాయి. దాదాపు మూడు నెలల క్రితం బలూచిస్తాన్‌లోని పోలీస్ స్టేషన్లు, హైవేలు లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో 73 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Also Read:
రెండు రోజుల్లో అల్పపీడనం.. 11, 13 తేదీల్లో కుండపోత
భర్తకు జాబ్ పోయిందని విడాకులిచ్చి.. 4 ఏళ్ల తరువాత ఊహించని విధంగా..
For More International News and Telugu News..