Pakistan: పాకిస్థాన్ ఎన్నికల్లో హంగ్..! నవాజ్ షరీఫ్ ఏమన్నారంటే
ABN , Publish Date - Feb 10 , 2024 | 11:00 AM
పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలు(Pakistan Elections) హంగ్ దిశగా సాగుతున్నాయి. మాజీ ప్రధానులు ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్ బలపరచిన స్వతంత్ర అభ్యర్థులు చాలా చోట్ల విజయం సాధించారు. అయితే ఎన్నికల సంఘం గెలిచిన పార్టీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలు(Pakistan Elections) హంగ్ దిశగా సాగుతున్నాయి. మాజీ ప్రధానులు ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్ బలపరచిన స్వతంత్ర అభ్యర్థులు చాలా చోట్ల విజయం సాధించారు. అయితే ఎన్నికల సంఘం గెలిచిన పార్టీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. స్పష్టమైన మెజారిటీ ఎవరికీ రాకపోయి ఉండచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. తమ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించడంలో విఫలమైనందున సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇతర పార్టీలతో మాట్లాడతానని నవాజ్ షరీఫ్ చెప్పారు.
జైలు నుంచి ఓటు వేసిన మాజీ క్రికెటర్ ఖాన్ మాట్లాడుతూ.. 264 స్థానాల్లో తాను మద్దతుపరిచిన స్వతంత్రుల్లో 170కిపైగా అభ్యర్థులు గెలుపొందినట్లు చెప్పారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో ఎన్నికలు జరగ్గా.. శుక్రవారం నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి.
వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. జైలులో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(Nawaz Sharif) PML-N పార్టీల అభ్యర్థుల మధ్యే బలమైన పోటీ ఉండనుంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి