Britain: సోదరుల మధ్య విభేదాలు.. ఎందుకంటే..?
ABN , Publish Date - Jul 31 , 2024 | 02:15 PM
బ్రిటన్ రాజవంశ వారసులు విలియం, ప్రిన్స్ హ్యారీ మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. తన తల్లి ప్రిన్సెస్ డయానా ఆభరణాలను సోదరుడి భార్య మెర్కెల్ ధరించకుండా విలియం అడ్డుకున్నారని తెలిసింది. ఈ విషయం రచయిత రాబ్ జాబ్సన్ రాసిన ‘కేథరిన్.. ది ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ పుస్తకంలో రాశారు. ఆ పుస్తకంలోని వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
లండన్: బ్రిటన్ రాజవంశ వారసులు విలియం (Britain Prince William), ప్రిన్స్ హ్యారీ మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. తన తల్లి ప్రిన్సెస్ డయానా ఆభరణాలను సోదరుడి భార్య మెర్కెల్ ధరించకుండా విలియం అడ్డుకున్నారని తెలిసింది. ఈ విషయం రచయిత రాబ్ జాబ్సన్ రాసిన ‘కేథరిన్.. ది ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ పుస్తకంలో రాశారు. ఆ పుస్తకంలోని వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
గత ఏడాది నుంచి..
రాజకుమారుడు విలియం, అతని సోదరుడు ప్రిన్స్ హ్యారీ మధ్య విభేదాలు గత ఏడాది బయటపడ్డాయి. హ్యారీ నటి మేఘన్ మెర్కెల్ పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొని రావడంతో సోదరులు మధ్య రిలేషన్ షిప్ తగ్గింది. మెర్కెల్‌కు రాజకుటుంబ పద్ధతులు, జీవన విధానం, సంప్రదాయాలు తెలుసుకునేందుకు కొంత సమయం ఇస్తామని విలియం ప్రతిపాదించాడట. ఆ మాటలు హ్యారీకి ఎంతమాత్రం నచ్చలేదు. సోదరుడి మాటలను ఖతరు చేయకుండా పెళ్లి చేసుకున్నాడు. దాంతో విభేదాలు తారస్థాయికి చేరాయి. మెర్కెల్‌ను రాజకుటుంబంలోకి తీసుకోవడానికి విలియం నిరాకరించాడని హ్యారీ చెప్పుకొచ్చారు. తన తల్లి డయానా ఆభరణాలను విలియం భార్య కేట్ మాత్రమే ధరించాలని కోరుకుంటున్నాడని పేర్కొన్నారు.
అడ్డుకున్న విలియం
డయానా ఆభరణాలు మెర్కెల్ ధరించకుండా అడ్డుకున్నారని రచయిత రాబ్ జాబ్సన్ పుస్తకంలో రాసుకొచ్చారు. డయానా నిశ్చితార్థ ఉంగరాన్ని ప్రిన్స్ విలియం కేట్ మిడిల్టన్‌కు ఇచ్చి ప్రపోజ్ చేశారు. హ్యారీ పెళ్లి చేసుకునే సమయంలో డయానాకు సంబంధించిన ఆభరణాలు ఇవ్వడానికి మాత్రం నిరాకరించారట. ప్రిన్స్ హ్యారీకి పెళ్లికాక ముందు రాజకుటుంబం గురించిన విషయాలు పేర్కొన్నారు. హ్యారీ ప్రేమను రాజ కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని తెలిసింది. దాంతో విభేదాలు భగ్గుమన్నాయట.
స్పేర్.. అదనమే..!!
బ్రిటన్ రాజ కుటుంబ సభ్యుడిగా తన అనుభవాలతో హ్యారీ పుస్తకం కూడా రాశాడు. స్పేర్ పేరుతో పబ్లిష్ కాగా అప్పట్లో సంచలనం సృష్టించింది. కుటుంబ సభ్యులు తనను (స్పేర్) అదనంగా చూసేవారని వివరించారు. సోదరుడితో గొడవ జరిగిందని పేర్కొన్నారు. పెళ్లి విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయని, పెళ్లి తర్వాత తన భార్యను వేదనకు గురిచేశారని వెల్లడించారు. ఇప్పుడు తల్లి ఆభరణాల గురించి సోదరుల మధ్య విభేదాలను సృష్టించింది. కుటుంబ పరువు బజారున పడేసిందని రాజకుటుంబీకులు వాపోతున్నారు.
Read Latest International News and Telugu News