Share News

జీ20 డిక్లరేషన్‌లో మాస్కోపై మెతక వైఖరి!

ABN , Publish Date - Nov 21 , 2024 | 05:11 AM

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించడంలో జీ-20 సదస్సు డిక్లరేషన్‌ వరుసగా రెండో ఏడాది కూడా విఫలమైంది.

జీ20 డిక్లరేషన్‌లో మాస్కోపై మెతక వైఖరి!

న్యూఢిల్లీ, నవంబరు 20: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించడంలో జీ-20 సదస్సు డిక్లరేషన్‌ వరుసగా రెండో ఏడాది కూడా విఫలమైంది. అయితే యుద్ధాన్ని ముగించాలని రాబోయే ట్రంప్‌ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో కీవ్‌కు మద్దతు అందించే విషయంలో ఉదాసీనతను ప్రదర్శించింది. అంతకుముందు ఢిల్లీ డిక్లరేషన్‌ కూడా రష్యా పట్ల మెతక వైఖరి అవలంబించింది. ఢిల్లీ డిక్లరేషన్‌లో రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంపై ఏడు పేరాలు ఉండగా, ఇప్పుడు ఒక్క పేరాతో సరిపెట్టారు. అలాగే ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అని పుతిన్‌తో జరిపిన చర్చల్లో ప్రధాని మోదీ ఇచ్చిన సందేశానికి కూడా రియో డిక్లరేషన్‌లో స్థానం దక్కలేదు. సమగ్ర కాల్పుల విరమణ కోరుతూ... యుద్ధం కారణంగా ఆహార ఇంధన భద్రత,, పంపిణీ వ్యవస్థల ఛిన్నాభిన్నం, ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణం, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలను చూపుతున్నాయని తాజా తీర్మానం ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా పేరు ప్రస్తావించకుండానే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని బెదిరించడాన్ని ఏమాత్రం ఆమోదించబోమని స్పష్టం చేసింది.

Updated Date - Nov 21 , 2024 | 05:11 AM