Share News

Saudi Arabia: నియోమ్‌కు అడ్డొస్తే అంతే సంగతులు..!!

ABN , Publish Date - May 09 , 2024 | 01:35 PM

నియోమ్ ప్రాజెక్టును సౌదీ అరేబియా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో నియోమ్ పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది. తమ డ్రీమ్ ప్రాజెక్టుకు ఎవరైనా అడ్డొస్తే చాలు.. చంపేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా దళాల్లో పనిచేసిన ఒక అధికారి వివరించారు.

Saudi Arabia: నియోమ్‌కు అడ్డొస్తే అంతే సంగతులు..!!
Saudi Arabia Neom

ఏబీఎన్ ఇంటర్నెట్: నియోమ్ (Neom) ప్రాజెక్టును సౌదీ అరేబియా (Saudi Arabia) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో నియోమ్ పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది. తమ డ్రీమ్ ప్రాజెక్టుకు ఎవరైనా అడ్డొస్తే చాలు.. చంపేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా దళాల్లో పనిచేసిన ఒక అధికారి వివరించారు. నియోమ్ ప్రాజెక్ట్‌ను సౌదీ అరేబియా ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తోంది. అందుకు గల కారణాలేంటీ..?


విషయం ఎంటంటే..?

ప్రపంచం అడ్వాన్స్‌గా మారుతుంది. అన్ని విభాగాల్లో వేగంగా డెవలప్ అవుతోంది. టెక్నాలజీ విషయంలో చెప్పక్కర్లేదు. ఇప్పుడు వాడుతోన్న పెట్రో ఉత్పత్తులకు భవిష్యత్‌‌లో డిమాండ్ తగ్గొచ్చు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేశాయ్. సౌదీ అరేబియాలో (Saudi Arabia) పెట్రో నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి. గ్రీన్ ఎనర్జీపై సౌదీ అరేబియా దృష్టిసారించింది. సౌదీ అరేబియాను (Saudi Arabia) గ్లోబల్ హబ్, పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని అనుకుంది. ఆ క్రమంలో ఆవిర్భవించిందే నియోమ్ స్మార్ట్ సిటీ. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.


భారీ బడ్జెట్

ఎర్ర సముద్ర తీరంలో 26 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో నియోమ్ (Neom) ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ప్లోటింగ్ పోర్ట్, స్కై రిసార్ట్, సర్వాట్ పర్వతాలపై నిర్మాణాలు, మిర్రర్డ్ సిటీ, ది లైన్ లాంటి పది రీజియన్లు ఉంటాయి. నియోమ్ ప్రాజెక్టును కోసం 500 బిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించారు. నియోమ్‌లో ప్రపంచంలో అతి పెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. వర్చువల్ ఫార్మింగ్, గ్రీన్ హౌస్ ద్వారా వాడే ఆహారాన్ని స్థానికంగా ఉత్పత్తి చేస్తారు.


10 రీజియన్లు.. ఏం జరిగిందంటే..?

నియోమ్ (Neom) స్మార్ట్ సిటీలో 10 రీజియన్లలో ది లైన్ ప్రాజెక్ట్ కీలకమైంది. ప్రాజెక్టు కోసం భూ సేకరణ అవసరమైంది. మూడు గ్రామాలను ఖాళీ చేసేందుకు సౌదీ బలగాలు తీవ్రంగా ప్రయత్నించాయి. అబ్దుల్ రహీం అల్ హువైటీ అనే వ్యక్తి తన భూమిలోకి అధికారులను రానీయలేదు. ఆ మరునాడే అతడిని దళాలు కాల్చి వేశాయి. తర్వాత ఆందోళనలు జరగగా 47 మంది స్థానికులను అరెస్ట్ చేశారు. ఐదుగురికి ఉరి శిక్ష కూడా విధించారు. హువైటీ అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని పదుల సంఖ్యల్లో అరెస్ట్ చేశారు.


లండన్‌లో కల్నల్

నియోమ్ (Neom) ప్రాజెక్ట్ కోసం జరిగిన ఘటనలను గతంలో పనిచేసిన కర్నల్ ఎలెన్జీ బయట పెట్టారు. జరిగిన విషయాలను ఓ వార్తా సంస్థకు పూస గుచ్చినట్టు వివరించారు. అతను ప్రస్తుతం లండన్‌లో తల దాచుకుంటున్నారు. ఆ విషయం సౌదీ అరేబియా పసిగట్టింది. లండన్ దౌత్య కార్యాలయానికి రావాలని తనను సౌదీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కోరారని కర్నల్ వివరించారు. అందుకు తాను నిరాకరించానని వివరించారు. అరబ్ దేశం సౌదీ అరేబియా తన భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మారుతుంది. ఆ క్రమంలో అడ్డొచ్చిన వారిని అంతమొందిస్తోంది. నాలుగేళ్ల క్రితం జరిగిన దారుణాల గురించి ఓ అధికారి నోరు మెదపడంతో ప్రపంచానికి తెలిసింది.



Read Latest
International News and Telugu News

Updated Date - May 09 , 2024 | 01:40 PM