Share News

Navy: భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

ABN , Publish Date - Mar 29 , 2024 | 09:11 PM

అరేబియా సముద్రంలో శుక్రవారం సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ నౌకను బంధించిన సముద్రపు దొంగల చెర నుంచి పాకిస్థానీలను భారత నేవీ రక్షించింది. భారత నేవీ యుద్ధనౌక INS సుమిత్ర సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన మత్స్యకారులను రక్షించినట్లు భారత రక్షణ అధికారులు తెలిపారు.

Navy: భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు

ఇరాన్: అరేబియా సముద్రంలో శుక్రవారం సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ నౌకను బంధించిన సముద్రపు దొంగల చెర నుంచి పాకిస్థానీలను భారత నేవీ రక్షించింది. భారత నేవీ యుద్ధనౌక INS సుమిత్ర సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన మత్స్యకారులను రక్షించినట్లు భారత రక్షణ అధికారులు తెలిపారు.

ఇరాన్ ఫిషింగ్ నౌక అల్ కమర్ 786లో దాదాపు 17 మంది సిబ్బంది ఉన్నారు. ఈ నౌకను 9 మంది సాయుధ సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. INS సుమిత్ర.. నౌకను అడ్డగించి అందులోని పాకిస్థానీ సిబ్బందిని సురక్షితంగా రక్షించింది.

ఎర్ర సముద్రంలోని కార్గో నౌకలు, ఇతర కీలకమైన వ్యాపార మార్గాలపై ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారుల వరుస దాడుల మధ్య తాజా ఘటన చోటు చేసుకుంది. ఈ ఆపరేషన్ లో భారత నేవీకి చెందిన రెండు యుద్ధ నౌకలు, స్పెషల్ ట్రైన్డ్ నేవీ కమాండోలు పాల్గొన్నారు. హైజాక్ నుంచి బాధితులను కాపాడటంతో భారత నేవీపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.

Updated Date - Mar 29 , 2024 | 09:12 PM