Share News

Port Louis: మారిషస్ సంచలన నిర్ణయం.. అయోధ్య కోసం ఏకంగా...

ABN , Publish Date - Jan 13 , 2024 | 01:07 PM

దేశమంతటా రామ నామ స్మరణ(Lord Rama) మార్మోగుతుండగా.. ఆఫ్రికాలోని ఓ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వీక్షించేందుకు దేశంలోని హిందూవులందరికీ(Hindu Community) 2 గంటలపాటు ప్రత్యేక విరామం మంజూరు చేస్తున్నట్లు మారిషస్ దేశ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్(Pravind Kumar Jugnauth) ప్రకటించారు.

Port Louis: మారిషస్ సంచలన నిర్ణయం.. అయోధ్య కోసం ఏకంగా...

పోర్ట్ లూయిస్: దేశమంతటా రామ నామ స్మరణ(Lord Rama) మార్మోగుతుండగా.. ఆఫ్రికాలోని ఓ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వీక్షించేందుకు దేశంలోని హిందూవులందరికీ(Hindu Community) 2 గంటలపాటు ప్రత్యేక విరామం మంజూరు చేస్తున్నట్లు మారిషస్ దేశ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్(Pravind Kumar Jugnauth) ప్రకటించారు.

ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం లైవ్ గా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మారిషస్(Mauritius)లోని హిందూ సంఘాల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 22న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ప్రత్యేక సెలవు ప్రకటించింది.


ఈ నిర్ణయం ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందింది. మారిషస్ లో హిందూ మతం పెద్దది. 2011 లెక్కల ప్రకారం ఆ దేశ జనాభాలో దాదాపు 48.5 శాతం హిందువులే ఉన్నారు. ఆఫ్రికాలో హిందూమతాన్ని అత్యధికంగా ఆచరించే ఏకైక దేశం మారిషస్.

భారత్‌లోని మధ్యప్రదేశ్‌, బిహార్, ఉత్తరప్రదేశ్. జార్ఖండ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఏపీలకు చెందిన వారు ఎక్కువగా ఆ దేశంలో నివసిస్తున్నారు. జనవరి 22న పెద్ద ఆలయ గర్భగుడిలో శ్రీరామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి 7 వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. అయోధ్య నగరి సర్వాంగ సుందరంగ ముస్తాబు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - Jan 13 , 2024 | 01:09 PM