Share News

Portugal PM: పోర్చుగల్ ప్రధాని రాజీనామా.. తెరవెనుక అసలు కథ ఇదే!

ABN , Publish Date - Feb 18 , 2024 | 04:31 PM

పోర్చుగల్‌లో తాజాగా ఎవ్వరూ ఊహించని షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధానమంత్రి ఆంటోనియో కోస్టా రాజీనామా చేశారు. తనపై అవినీతి ఆరోపణలు వచ్చిన తరుణంలో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, లిథియం గనుల కుంభకోణాలకు సంబంధించి.. పోలీసులు అతని ఇంటిపై దాడి చేశారు.

Portugal PM: పోర్చుగల్ ప్రధాని రాజీనామా.. తెరవెనుక అసలు కథ ఇదే!

పోర్చుగల్‌లో తాజాగా ఎవ్వరూ ఊహించని షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధానమంత్రి ఆంటోనియో కోస్టా రాజీనామా చేశారు. తనపై అవినీతి ఆరోపణలు వచ్చిన తరుణంలో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, లిథియం గనుల కుంభకోణాలకు సంబంధించి.. పోలీసులు అతని ఇంటిపై దాడి చేశారు. ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్, సన్నిహిత సలహాదారుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో భాగంగా తనపై దర్యాప్తు జరుగుతుండటంతో అవమానంగా భావించిన కోస్టా.. ప్రధాని పదవికి ఉన్నపళంగా రాజీనామా చేశారు. ఇదే సమయంలో.. చట్టవిరుద్ధంగా తాను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని, నిజాయితీగానే ఉన్నానని చెప్పారు. దర్యాప్తులో ఏం తేలినా.. తాను మళ్లీ ప్రధాని పదవిని చేపట్టనని తేల్చి చెప్పారు. మరోవైపు.. ఆయన రాజీనామాను ఆమోదించడం జరిగిందని, పార్లమెంట్‌ను రద్దు చేసే ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో తెలిపారు.


ఇదిలావుండగా.. ఆంటోనియ కోస్టా ఆధ్వర్యంలో పోర్చుగల్ యూరోపియన్ ఎంతో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా.. ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ ఐరోపాలోనే అత్యుత్తమ పనితీరుని కనబరించింది. ఈ సంవత్సరం 2% వృద్ధితో ముగుస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇక పర్యాటకంతో పాటు సాంకేతిక రంగాలు కూడా పరుగులు పెట్టాయి. దీంతో.. పెట్టుబడిదారులు పోర్చుగల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదంతా కోస్టా హయాంలోనే జరిగింది. కానీ.. దురదృష్టవశాత్తూ అవినీతి ఆరోపణలు ఆయన్ను అవమానపర్చాయి. అందుకే.. ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. కాగా.. 2015 నుంచి అధికారంలో ఉన్న కోస్టా తొలుత వామపక్ష పార్టీలతో సంకీర్ణానికి నాయకత్వం వహించారు. అనంతరం మైనారిటీ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. 2022లో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్‌లో తన పార్టీకి సంపూర్ణ మెజారిటీని సాధించి పెట్టారు.

Updated Date - Feb 18 , 2024 | 04:31 PM