Share News

Russia earthquake: 7.0 తీవ్రతతో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు

ABN , Publish Date - Aug 18 , 2024 | 08:27 AM

రష్యాలో భారీ భూకంపం సంభవించి ఆ దేశ తూర్పు తీర ప్రాంతాన్ని వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదు. తూర్పు తీర ప్రాంత నగరమైన పెట్రోపవ్‌లావ్‌స్కీ-కమ్‌చట్‌స్కీకి 102 కిలోమీటర్ల దూరంలో భూకంప నమోదు కేంద్రాన్ని గుర్తించిన్టటు యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

Russia earthquake: 7.0 తీవ్రతతో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు

మాస్కో: రష్యా (Russia)లో భారీ భూకంపం సంభవించి ఆ దేశ తూర్పు తీర ప్రాంతాన్ని వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదు. తూర్పు తీర ప్రాంత నగరమైన పెట్రోపవ్‌లావ్‌స్కీ-కమ్‌చట్‌స్కీ (petropavlovsk-Kamchatsky)కి 102 కిలోమీటర్ల దూరంలో భూకంప నమోదు కేంద్రాన్ని గుర్తించిన్టటు యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే తెలిపింది. రష్యా కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 5.25 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.

Washington : ఉగ్రవాది రాణాను భారత్‌కు అప్పగించవచ్చు


రష్యా నౌకాదళానికి కీలక ప్రాంతమైన పెట్రోపవ్‌లావ్‌స్కీ-కమ్‌చట్‌స్కీ నగరంలో 1,80,000 మంది నివాసం ఉంటున్నారు. చుట్టూ అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అత్యధిక భాగం నావల్ బేస్ అధీనంలో ఉంది. భారీ భూకంపం నేపథ్యంలో హొనులులు లోని యూఎస్ నేషనల్ సర్వీస్‌కు చెందిన పసిఫిక్ సునామా హెచ్చరిక కేంద్రం తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే కొద్దిసేపటి తర్వాత సునామా హెచ్చరికలను ఉపసంహరించుకుంది. సముద్ర మట్టంలో కదలికలల కారణంగా కోస్తా ప్రాంతంలోని కొన్ని చోట్ల అలలు ఎగిసిపడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్తగా తీరప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు.

Updated Date - Aug 18 , 2024 | 08:28 AM