Share News

China-Taiwan: చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తత.. 13 సైనిక విమానాలు, 9 నౌకల మోహరింపు

ABN , Publish Date - May 29 , 2024 | 09:57 AM

చైనా(china), తైవాన్(Taiwan) దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం మరింత పెరుగుతోంది. బీజింగ్ తన దుందుడుకు చర్యల నుంచి వైదొలగడం లేదు. ఈ క్రమంలోనే మరోసారి చైనా సైన్యం తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో 13 చైనా విమానాలు, ఐదు నౌకాదళ నౌకలు, నాలుగు కోస్ట్ గార్డ్ నౌకలను మోహరించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

China-Taiwan: చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తత.. 13 సైనిక విమానాలు, 9 నౌకల మోహరింపు
Rising tensions with Beijing and Taiwan

చైనా(china), తైవాన్(Taiwan) దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం మరింత పెరుగుతోంది. బీజింగ్ తన దుందుడుకు చర్యల నుంచి వైదొలగడం లేదు. ఈ క్రమంలోనే మరోసారి చైనా సైన్యం తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో 13 చైనా విమానాలు, ఐదు నౌకాదళ నౌకలు, నాలుగు కోస్ట్ గార్డ్ నౌకలను మోహరించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు తైవాన్ చుట్టూ చైనా సైనిక విమానాలు, నౌకాదళ నౌకలు కనిపించాయని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ (MND) వెల్లడించింది.


ఇది మాత్రమే కాదు 13 చైనా విమానాల్లో మూడు తైవాన్ జలసంధి మధ్య రేఖను దాటాయని పేర్కొన్నారు. ఒకరు నైరుతిలో దేశం ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ (ADIZ) లోపలికి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. చైనా, తైవాన్(China-Taiwan) మధ్య నీటి ఒప్పందం, అనధికారిక సరిహద్దు సహా పలు అంశాల్లో గత అనేక నెలలుగా వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో చైనా కార్యకలాపాలను అడ్డుకునేందు తైవాన్ కూడా ప్రతిస్పందించి విమానం, నౌకాదళ నౌకలు, వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలను మోహరించింది.


గ్రే జోన్ వ్యూహం(gray zone plan) ఏంటి?

ఇప్పటి వరకు చైనా నేరుగా తైవాన్‌పై దాడి చేయలేదు. కానీ గ్రే జోన్‌లో(gray zone) ఇదంతా చేస్తుంది. దీని కారణంగా అది నేరుగా యుద్ధం చేయదు. కానీ దాని ప్రభావం చూపుతుందని అంటున్నారు. గ్రే జోన్ అంటే ఒక దేశం నేరుగా దాడి చేయదు. కానీ ఎల్లప్పుడూ అలాంటి భయాన్ని కొనసాగిస్తుంది. ప్రత్యక్ష సైనిక చర్యకు బదులుగా, దాడి భయాన్ని సృష్టించే అనేక విషయాలు జరుగుతున్నాయి. తైవాన్‌తో చైనా చేస్తున్నది ఇదే. చైనా సెప్టెంబర్ 2020 నుంచి 'గ్రే జోన్' వ్యూహాలను తరచుగా ఉపయోగిస్తోంది. ఒక్క ఏప్రిల్‌లోనే చైనా సైనిక విమానాలు, నౌకాదళ నౌకలు తైవాన్‌లో 40 సార్లు, 27 సార్లు గుర్తించబడ్డాయి.


నిజానికి గ్రే జోన్ యుద్ధ వ్యూహం చాలా కాలం పాటు ప్రత్యర్థిని క్రమక్రమంగా బలహీనపరిచే మార్గమని, తైవాన్‌తో చైనా(china) చేయాలనుకున్నది ఇదేనని నిపుణులు చెబుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు దాదాపు 403 చైనా సైనిక విమానాలు, దాదాపు 243 నావికా/కోస్ట్ గార్డ్ నౌకలు తైవాన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాయి. తైవాన్‌ను ఎన్నడూ పాలించనప్పటికీ చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీ దానిని తన భూభాగంలో భాగంగా పరిగణిస్తుంది.


ఇది కూడా చదవండి:

Viral Video: టగ్ ఆఫ్ వార్‌లో చైనా సైనికులపై భారత్ సైనికుల విజయం



Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త

Read Latest International News and Telugu News

Updated Date - May 29 , 2024 | 10:27 AM