Share News

Ukraine: ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. క్షిపణి దాడుల్లో 41 మంది మృతి

ABN , Publish Date - Sep 03 , 2024 | 06:35 PM

రష్యా క్షిపణులు ఒక విద్యా సంస్థను, సమీపంలోని ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినట్టు జెలెన్‌స్కీ తెలిపారు. శిథిలాల క్రింద చిక్కుకున్న పలువురిని రక్షించినట్టు చెప్పారు. 180 మందికి పైగా గాయపడగా, 41 మంది వరకూ మరణించినట్టు సమాచారం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Ukraine: ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. క్షిపణి దాడుల్లో 41 మంది మృతి

కీవ్: ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా (Russia) మరోసారి భీకర దాడికి దిగింది. పోల్టోవా (Poltava) సిటీపై మంగళవారంనాడు జరిపిన రెండు క్షిపణి దాడుల్లో 41 మంది మృతి చెందగా, 180 మందికి పైగా గాయపడ్డారు. రష్యా బలగాలు రెండు బాలిస్టిక్ క్షిపణులతో పోల్టావా సిటీతో దాడి జరిపిందని, కమ్యూనికేషన్స్ ఇన్‌స్టిట్యూట్ భవంతి ధ్వంసమైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy) ఒక వీడియోలో తెలిపారు.

రష్యా క్షిపణులు ఒక విద్యా సంస్థను, సమీపంలోని ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినట్టు జెలెన్‌స్కీ తెలిపారు. శిథిలాల క్రింద చిక్కుకున్న పలువురిని రక్షించినట్టు చెప్పారు. 180 మందికి పైగా గాయపడగా, 41 మంది వరకూ మరణించినట్టు సమాచారం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

PM Modi: బ్రూనైలో మోదీకి క్రౌన్ ప్రిన్స్ ఘన స్వాగతం.. రికార్డు సృష్టించిన ప్రధాని

దాడులకు మూల్యం తప్పదు

ఉక్రెయిన్‌ సిటీపై దాడులకు రష్యా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అధ్యక్షుడు ఆ వీడియోలో హెచ్చరించారు. "ఈ భయోత్పాతాన్ని అపగలిగే శక్తి ఉన్న ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉక్రెయిన్‌కు ఇప్పుడు డిఫెన్స్ సిస్టమ్‌లు, క్షిపణులు అవసరం. దీర్ఘ శ్రేణి క్షిపణులే ఇప్పుడు రష్యా టెర్రర్‌ నుంచి మమ్మల్ని రక్షించ గలిగేవి. ఇవి ఇప్పుడే అవసరం, ఆ తర్వాత కాదు. ఆలస్యం జరుగుతున్న ప్రతిరోజూ ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు'' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

Updated Date - Sep 03 , 2024 | 06:38 PM