Share News

Japan: పడిపోయిన జపాన్ ఆర్థిక వ్యవస్థ.. కారణాలేంటంటే

ABN , Publish Date - Feb 15 , 2024 | 05:20 PM

తన స్థానాన్ని పదిలం చేసుకుని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనకున్న జపాన్(Japan) ఆశలు ఆడియాసలయ్యాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించి నాలుగో స్థానానికి పడిపోయింది. గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జర్మనీ జీడీపీ 2023లో 4.4 ట్రిలియన్ డాలర్లు కాగా, జపాన్ జీడీపీ 4.29 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది.

Japan: పడిపోయిన జపాన్ ఆర్థిక వ్యవస్థ.. కారణాలేంటంటే

టోక్యో: తన స్థానాన్ని పదిలం చేసుకుని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనకున్న జపాన్(Japan) ఆశలు ఆడియాసలయ్యాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించి నాలుగో స్థానానికి పడిపోయింది. గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జర్మనీ జీడీపీ 2023లో 4.4 ట్రిలియన్ డాలర్లు కాగా, జపాన్ జీడీపీ 4.29 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. జపాన్ కరెన్సీ యూఎస్‌తో పోలిస్తే 2022లో 5వ వంతు క్షీణించగా.. 2023లో అది 7 శాతం తగ్గింది. జపాన్, జర్మనీలు చిన్న, మధ్యతరహా వ్యాపారాల ద్వారా దేశాల ఆర్థిక వ్యవస్థను నిర్మించుకున్నాయి.

జపాన్‌లో వృద్ధుల సంఖ్య పెరగడం, యువత తగ్గడం, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం తదితర కారణాలతో ఆర్థిక వ్యవస్థల్లో తన మూడో స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. జపాన్, జర్మనీల్లో జనాభా తగ్గుతున్నప్పటికీ ఈ ప్రభావం జపాన్‌పై ఎక్కువగా పడింది. 2023లో జపాన్ ఆర్థిక వ్యవస్థ 0.1 శాతం త్రైమాసికానికి తగ్గిందని, 0.2 శాతం వృద్ధి.. మార్కెట్ అంచనాలను కోల్పోయిందని నివేదికలో వెల్లడైంది. రెండో ప్రపంచ యుద్ధం గాయాల నుంచి కోలుకుని నిలబడిన దేశంగా జపాన్‌కి పేరుంది.


ఎన్నో అంతర్జాతీయ కంపెనీలను నెలకొల్పి, నాణ్యమైన వస్తువులను జపాన్ ఉత్పత్తి చేస్తోంది. అయితే తాజాగా ఆర్థిక వ్యవస్థలో వచ్చిన కుదుపు దేశ భవిష్యత్తును అంధకారంలో పడేసే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇక నుంచి జపాన్ తీసుకునే నిర్ణయాలపై దేశ ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల లిస్టులో అమెరికా తొలి స్థానంలో ఉండగా, చైనా, జర్మనీ, జపాన్, భారత్ వరుసగా తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 2075 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేసింది.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2024 | 05:22 PM