Washington : వాట్సాప్ స్టేట్‌సకు లైక్ ఆప్షన్
ABN , Publish Date - Aug 18 , 2024 | 04:16 AM
ఇన్‌స్టాగ్రామ్ తరహాలో స్టేట్‌సను లైక్ చేసే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రకటించింది.
వాషింగ్టన్, ఆగస్టు 17: ఇన్‌స్టాగ్రామ్ తరహాలో స్టేట్‌సను లైక్ చేసే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రకటించింది. అంతేకాదు.. తన మాతృసంస్థ ‘మెటా’కు చెందిన ‘మెటా ఏఐ వాయి్‌స’తో వాట్సా్‌పను అనుసంధానించి, వినియోగదారులు రియల్-టైమ్ వాయిస్ సంభాషణల్లో పాల్గొనేలా వీలు కల్పించనున్నట్లు తెలిపింది.
మొదటి ఫీచర్‌ను ప్రస్తుతం పరిమిత సంఖ్యలో 2.24.17.21 బీటా వెర్షన్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు.. వీరు స్టేట్‌సలను నేరుగా లైక్ చేసేలా స్ర్కీన్ దిగువన ‘హార్ట్’ ఎమోజీ ఉంటుందని పేర్కొంది. దాన్ని క్లిక్ చేస్తే.. స్టేటస్ లైక్ అవుతుందని, తమ స్టేట్‌సను ఎవరెవరు లైక్ చేశారనే దాన్ని వినియోగదారులు ‘వ్యూవ్స్’ ఆప్షన్‌లో చూసుకోవచ్చని వివరించింది. రియల్-టైమ్ వాయిస్ సంభాషణల విషయంలో మెటాతో కలిసి పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించింది.