Share News

India-Pakistan Border: తుపాకులు, బులెట్లను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్

ABN , Publish Date - Jul 18 , 2024 | 05:08 PM

పంజాబ్‌లోని భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద నాలుగు చైనా తుపాకీలు, 50 రౌండ్ల పాకిస్థాన్ బులెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రత సిబ్బంది ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు.

India-Pakistan Border:  తుపాకులు, బులెట్లను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్

జలంధర్, జులై 18: పంజాబ్‌లోని భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద నాలుగు చైనా తుపాకీలు, 50 రౌండ్ల పాకిస్థాన్ బులెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రత సిబ్బంది (Border Security Force) ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. ఈ రోజు ఉదయం 2.00 గంటలకు తర్న తరణ్ జిల్లాలో కల్సియాన్ గ్రామంలో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇవి లభ్యమైనవని పేర్కొన్నారు. వీటిని ద్రోనుల ద్వారా జార విడిచి ఉంటారని పేర్కొన్నారు.

Also Read: Maharastra: లండన్‌ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ‘వాఘ్ నఖా’.. రేపటి నుంచి ప్రదర్శన


అయితే బలెట్లపై పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అని ముద్రించి ఉందన్నారు. భారత భూభాగంలో ఉగ్రవాదానికి పాకిస్థాన్ ప్రేరేపిత మూకలు ప్రణాళికులు రూపొందిస్తుంటాయని.. వారి అరాచకాలను తిప్పికొట్టడంలో బీఎస్ఎఫ్ ఎల్లప్పుడు ముందుంటుందని స్పష్టం చేశారు.

Also Read: Telangana: చిక్కుల్లో మరో ఐఏఎస్ అధికారి ఫ్రపుల్ దేశాయ్..!


తాజాగా సరిహద్దుల్లో సీజ్ చేసిన తుపాకులు, బులెట్లను స్వాధీనం చేసుకోవడం ద్వారా అది తేటతెల్లమైందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇక ఇటీవల ఇదే అంతర్జాతీయ సరిహద్దు వద్ద మూడు తుపాకులకు బీఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు గుర్తు చేశారు.

Maharastra: లండన్‌ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ‘వాఘ్ నఖా’.. రేపటి నుంచి ప్రదర్శన


కేరాన్ సెక్టార్‌లో ఎన్‌కౌంటర్

ఇక జమ్మూ కశ్మీర్‌, కుప్వారా జిల్లాలోని వాస్తవాధీన రేఖ సమీపంలో కేరన్ సెక్టార్‌లో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పుల చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఇరువైపులా హోరా హోరీగా కాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు మూడు రోజుల క్రితమే ఇదే ప్రాంతంలో భద్రతా దళాలకు , ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 18 , 2024 | 05:09 PM