Share News

Hinduja Family : హిందూజాలకు స్విట్జర్లాండ్‌ కోర్టు జైలు శిక్ష

ABN , Publish Date - Jun 22 , 2024 | 03:27 AM

బ్రిటన్‌లో అత్యంత సంపన్నుల్లో ఒకరిగా పేరుగాంచిన హిందూజా కుటుంబంలోని ప్రకాష్‌ ఆయన భార్య కమల్‌, కుమారుడు అజయ్‌, కోడలు నమ్రతకు స్విట్జర్లాండ్‌ క్రిమినల్‌ కోర్టు శుక్రవారం నాలుగు నుంచి నాలుగున్నరేళ్ల జైలు శిక్ష విధించింది.

Hinduja Family : హిందూజాలకు స్విట్జర్లాండ్‌ కోర్టు జైలు శిక్ష

జెనీవా, జూన్‌ 21: బ్రిటన్‌లో అత్యంత సంపన్నుల్లో ఒకరిగా పేరుగాంచిన హిందూజా కుటుంబంలోని ప్రకాష్‌ ఆయన భార్య కమల్‌, కుమారుడు అజయ్‌, కోడలు నమ్రతకు స్విట్జర్లాండ్‌ క్రిమినల్‌ కోర్టు శుక్రవారం నాలుగు నుంచి నాలుగున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రవాస భారతీయులైన వీరికి జెనీవాలో విలాస భవనం ఉంది. పిల్లల సంరక్షణ, ఇంటి పని కోసం అందులో భారతీయులను నియమించుకున్నారు. వారితో రోజుకు 18 గంటలు పనిచేయిస్తూ, వేతనంగా రూ.667 (ఏడాదికి రూ.2.43 లక్షలు) మాత్రమే చెల్లిస్తున్నారని, ఈ మొత్తం హిందూజాల పెంపుడు కుక్కపై వెచ్చిస్తున్నదాని (రూ.8.30 లక్షలు) కంటే తక్కువని, సిబ్బంది పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకున్నారని కేసు నమోదైంది. స్వల్ప వేతనాలపై రాజీ కుదిరినా.. పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకోవడాన్ని స్విట్జర్లాండ్‌లో మానవ అక్రమ రవాణాగా పరిగణిస్తారు. దీంతో హిందూజాలకు శిక్ష పడింది.

Updated Date - Jun 22 , 2024 | 11:28 AM