Share News

PM Sheikh Hasina: రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన బంగ్లా ప్రధాని

ABN , Publish Date - Jun 21 , 2024 | 06:45 PM

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం భారత్ చేరుకున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లా ప్రధాని హసీనాకు కేంద్ర సహాయ మంత్రి కృతివర్ధన్ సింగ్ స్వాగతం పలికారు.

PM Sheikh Hasina: రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన బంగ్లా ప్రధాని
Bangla PM

న్యూఢిల్లీ, జూన్ 21: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం భారత్ చేరుకున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లా ప్రధాని హసీనాకు కేంద్ర సహాయ మంత్రి కృతివర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటనతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.

Also Read: Delhi High Court: బెయిల్ వచ్చినా.. మంగళవారం వరకు జైల్లోనే..


భారత్ పొరుగునున్న దేశాల్లో నమ్మకమైన కీలక భాగస్వామి దేశం బంగ్లాదేశ్ అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్తగా ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. దేశానికి వస్తున్న ద్వైపాక్షిక దేశం బంగ్లాదేశ్ అని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనలో ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భారత రాష్ట్రపతి దౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తోపాటు ప్రధాని నరేంద్ర మోదీతో బంగ్లా ప్రధాని హసీనా సమాశమవనున్నారు.

Also Read: June 21: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా..


మరోవైపు జూన్ 9వ తేదీ ప్రధాని మోదీతోపాటు ఆయన కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వారిలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా కూడా ఉన్నారు. ఆ సమయంలో కాంగ్రస్ పార్టీ సీనియర్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో బంగ్లా ప్రధాని షేక్ హసీనా భేటీ అయిన విషయం విధితమే.

Also Read: AP Assembly: తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 07:29 PM