BSF: సరిహద్దులో చైనా డ్రోన్ కలకలం.. అందులో ఏముందో చూస్తే షాక్
ABN , Publish Date - May 12 , 2024 | 01:39 PM
భారత సరిహద్దులో ఓ వైపు చైనా, మరో వైపు పాకిస్థాన్ కవ్వింపులు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళాలు(BSF) చైనా ఎగరేసిన ఓ డ్రోన్‌ని శనివారం స్వాధీనం చేసుకున్నారు.
అమృత్‌సర్: భారత సరిహద్దులో ఓ వైపు చైనా, మరో వైపు పాకిస్థాన్ కవ్వింపులు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళాలు(BSF) చైనా ఎగరేసిన ఓ డ్రోన్‌ని శనివారం స్వాధీనం చేసుకున్నారు. అందులో 520 గ్రాముల బరువున్న హెరాయిన్ ప్యాకెట్‌లను గుర్తించారు. హెరాయిన్‌ని ప్యాకెట్లలో కట్టి ఉంచారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
"అమృత్‌సర్‌లోని హర్డో రత్తన్ గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో చైనా డ్రోన్‌ని గుర్తించాం. మే 11న తార్న్ తరన్ జిల్లా సరిహద్దు ప్రాంతంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల సరకుల సంబంధించి BSF ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం అందించింది. పంజాబ్ పోలీసుల సహకారంతో బీఎస్ఎఫ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. డ్రోన్‌ని ధ్వంసం చేసి తనిఖీ చేయగా.. అందులో హెరాయిన్ ప్యాకెట్లు కనిపించాయి" అని ఓ అధికారి తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రోన్‌ని చైనా మేడ్ డీజేఐ మావిక్ 3 క్లాసిక్‌గా గుర్తించారు.
ఇది కూడా చదవండి:
Delhi: కేంద్రంలో ‘ఇండియా’ సర్కారు: కేజ్రీవాల్
Varanasi : గంగా హారతిలో పాల్గొన్న అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్
Read Latest National News and Telugu News