Share News

Chief Judicial Magistrate of Pithorghar : నాణ్యత లోపించిన పతంజలి సోం పాపిడి

ABN , Publish Date - May 20 , 2024 | 04:19 AM

ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌లో నాణ్యత లేని సోం పాపిడి విక్రయిస్తున్నందుకు పతంజలి ఆయుర్వేద్‌ లిమిటెడ్‌ సంస్థ అసిస్టెంట్‌ మేనేజర్‌ సహా మరో ఇద్దరికి పితోర్‌ఘర్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ శనివారం ఆరు నెలల జైలు శిక్షతోపాటు జరిమానా విధించారు.

Chief Judicial Magistrate of Pithorghar : నాణ్యత లోపించిన పతంజలి సోం పాపిడి

  • కంపెనీ అధికారి సహా ఇద్దరికి జైలుశిక్ష

న్యూఢిల్లీ, మే 19: ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌లో నాణ్యత లేని సోం పాపిడి విక్రయిస్తున్నందుకు పతంజలి ఆయుర్వేద్‌ లిమిటెడ్‌ సంస్థ అసిస్టెంట్‌ మేనేజర్‌ సహా మరో ఇద్దరికి పితోర్‌ఘర్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ శనివారం ఆరు నెలల జైలు శిక్షతోపాటు జరిమానా విధించారు. పితోర్‌ఘర్‌లోని లీలాధర్‌ పాఠక్‌ అనే వ్యాపారి దుకాణంలో విక్రయానికి ఉంచిన పతంజలి నవరత్న ఎలియాచి సోం పాపిడిలో నాణ్యత లేదని ఫిర్యాదులు రావడంతో స్థానిక ఆహార భద్రత ఇన్‌స్పెక్టర్‌ 2019లో నమూనాలు సేకరించారు. వాటికి ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో ఉన్న ప్రభుత్వ ప్రయోగశాలలో పరీక్షలు జరిపి నాణ్యత లోపించినట్లు గుర్తించారు.

Updated Date - May 20 , 2024 | 04:19 AM