Telangana Politics: కన్ప్యూజన్‌లో కాంగ్రెస్.. మంత్రివర్గం విస్తరణ వాయిదా..!
ABN , Publish Date - Jul 04 , 2024 | 03:18 PM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది. ఇంకా పూర్తిస్థాయిలో మంత్రివర్గం కొలువుదీరలేదు. కేవలం రేవంత్‌తో పాటు 11మంది మంత్రులతో కేబినెట్ ఏర్పడింది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయలేదు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది. ఇంకా పూర్తిస్థాయిలో మంత్రివర్గం కొలువుదీరలేదు. కేవలం రేవంత్‌తో పాటు 11మంది మంత్రులతో కేబినెట్ ఏర్పడింది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయలేదు. ఎన్నికల తర్వాత కేబినెట్‌ను విస్తరించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచించింది. లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో కొత్త పీసీసీ చీఫ్ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా రేవంత్‌ను ఢిల్లీకి పిలిచి పలుమార్లు చర్చించింది. పీసీసీ చీఫ్‌తో పాటు.. మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలనేదానిపై రేవంత్ కొన్ని పేర్లను అధిష్టానానికి ప్రతిపాదించారు. అదే సమయంలో పార్టీలో కొందరు సీనియర్ నేతలు, మంత్రులు.. రేవంత్ ప్రతిపాదించిన పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఏకాభిప్రాయం రాకపోవడంతో పీసీసీ చీఫ్ ఎంపికతో పాటు.. మంత్రివర్గ విస్తరణను వాయిదావేసింది. అంతర్గత విబేధాలు సమసిపోయిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించాలని.. ఈలోపు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
CM Revanth Reddy: ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
అంతర్గత విబేధాలు..
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు సద్దుమణిగేట్లు కనిపించడం లేదు. అధికారంలో ఉన్న హస్తం పార్టీ నేతలు ఐక్యంగా ఉన్నట్లు పైకి కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం నేతల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయనే చర్చ జరుగుతోంది. నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మంత్రివర్గం విస్తరణ వాయిదాపడింది. రెడ్డి సామాజికవర్గం నుంచి ఇద్దరిని, వెలమ సామాజిక వర్గం నుంచి ఒకరిని, బీసీ-ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలోకి తీసుకోవాలని హైకమాండ్ నిర్ణయించింది. కానీ కొంతమంది సీనియర్లు అభ్యంతరం చెప్పడంతో మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయాల్సి వచ్చింది. మరోవైపు పీసీసీ చీఫ్‌గా బీసీ సామాజికవర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్‌ను ఎంపిక చేస్తారని ప్రచారం సాగింది. కానీ చివరి నిమిషంలో మహేష్ కుమార్ గౌడ్ నియమకాన్ని సీనియర్ మంత్రులు వ్యతిరేకిచారు. దీంతో చేసేదేమిలేక పీసీసీ చీఫ్‌తో పాటు మంత్రివర్గ విస్తరణను కాంగ్రెస్ హైకమాండ్ వాయిదావేసిందనే ప్రచారం సాగుతోంది.
BRS: మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మంత్రివర్గం విస్తరణపై..
రేవంత్ మంత్రివర్గంలో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఇప్పటివరకు కేబినెట్‌లో చోటు దక్కిని జిల్లాలకు అవకాశం కల్పించే ఉద్దేశంతో నలుగురు పేర్లను సీఎం రేవంత్ అధిష్టానానికి ప్రతిపాదించారు. ఇదే సమయంలో పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టివిక్రమార్కతో చర్చించగా.. వాళ్లు ఇతర పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో సమగ్ర అధ్యయనం, సంప్రదింపుల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని అధిష్టానం నిర్ణయించిందట. తొలుత పార్టీలో అంతర్గత విబేధాలు, బేధాభిప్రాయాలను పరిష్కరించిన తర్వాత పీసీసీ చీఫ్ ఎంపిక చేపట్టాలనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
NCW: మియాపూర్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Telangana News and Latest Telugu News