Share News

Odisha: నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం.. అవయవ దాతలకు గౌరవప్రద అంత్యక్రియలు

ABN , Publish Date - Feb 15 , 2024 | 09:32 PM

అవయవాలు దానం చేసేవారిని గౌరవంగా సాగనంపాలని ఒడిశా సర్కార్ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒడిశాలో అవయవ దానం చేసిన ఎవరికైనా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం నవీన్ పట్నాయక్ అధికారులను ఆదేశించారు.

Odisha: నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం.. అవయవ దాతలకు గౌరవప్రద అంత్యక్రియలు

భువనేశ్వర్‌: అవయవాలు దానం చేసేవారిని గౌరవంగా సాగనంపాలని ఒడిశా సర్కార్ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒడిశాలో అవయవ దానం చేసిన ఎవరికైనా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం నవీన్ పట్నాయక్(Naveen Patnaik) అధికారులను ఆదేశించారు. అవయవ దాతల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు. ఆర్గాన్ డోనార్స్‌ని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.


ఇదివరకే సూరజ్ అనే పేరుతో వారికి అవార్డులు ఇస్తున్నారు. 2019లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సూరజ్ అనే బాలుడి అవయవాలు దానం(Organ Donors) చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. అలా బాలుడి కాలేయం, గుండె, కళ్లు తదితర అవయవాలను దానం చేయడంతో మరి కొంత మందికి కొత్త జీవితం వచ్చింది.

విషయం తెలుసుకున్న నవీన్ పట్నాయక్ సూరజ్ తల్లిదండ్రులను కలిసి కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందజేశారు. వారి స్ఫూర్తిగా సూరజ్ పేరుతో ఏటా అవార్డులు ఇస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 15 , 2024 | 09:33 PM