మహారాష్ట్రలో మొత్తం ఓటర్లు 9.7 కోట్లు
ABN , Publish Date - Nov 02 , 2024 | 03:09 AM
మహారాష్ట్రలో 100 నుంచి 109 మధ్య వయసున్న ఓటర్లు 47,392 మంది ఉన్నారని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి వెల్లడించారు. ఈనెల 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది.
ముంబై, నవంబరు 1: మహారాష్ట్రలో 100 నుంచి 109 మధ్య వయసున్న ఓటర్లు 47,392 మంది ఉన్నారని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి వెల్లడించారు. ఈనెల 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. 288 నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 9,70,25,119 మంది ఉండగా.. వారిలో 5,00,22,739 మంది పురుష ఓటర్లు, 4,69,96,279 మంది మహిళా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు వారు 22 లక్షల మందికి పైగా కొత్తగా ఓటు హక్కు పొందారు. ఇక అంతర్గత, పొత్తు రాజకీయాలతో ఇప్పటికే సతమవుతున్న ప్రధాన రాజకీయ పార్టీలకు ఇండిపెండెంట్లతో కొత్త చిక్కు వచ్చి పడింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల పేరును పోలిన పేరున్న వారు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగుతుండటం వారికి తలనొప్పి తెచ్చిపెడుతోంది.