Share News

Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ డీప్‌ఫేక్ వీడియో.. కేసు నమోదు చేసిన పోలీసులు

ABN , Publish Date - Jul 10 , 2024 | 07:09 PM

డీప్‌ఫేక్.. మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సాంకేతిక సమస్యల్లో ఇది ఒకటి. మానవుల పురోగతి కోసం ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ని తీసుకొస్తే.. దాన్ని కొంతమంది తప్పుడు పనులకు..

Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ డీప్‌ఫేక్ వీడియో.. కేసు నమోదు చేసిన పోలీసులు
Nirmala Sitharaman Deepfake Video

డీప్‌ఫేక్ (Deepfake).. మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సాంకేతిక సమస్యల్లో ఇది ఒకటి. మానవుల పురోగతి కోసం ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ని (Artificial Intelligence) తీసుకొస్తే.. దాన్ని కొంతమంది తప్పుడు పనులకు వినియోగిస్తున్నారు. చివరికి.. రాజకీయ నేతలను సైతం విడిచిపెట్టడం లేదు. నేతలు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడమో, ఇతర వీడియోల్లో ముఖాన్ని మార్చడమో చేస్తూ.. సరికొత్త వివాదాలకు తెరలేపుతున్నారు. ఇప్పటికే ఇలాంటి వీడియోలు ఎన్నో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.


ఇప్పుడు ఆ తరహాలోనే ఎడిట్ చేసిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) డీప్‌ఫేక్ వీడియో ఒకటి తీవ్ర కలకలం రేపుతోంది. అందులో ఆమె మీడియాకు ఒక బైట్ ఇస్తున్నట్లు కనిపించారు. అంతేకాదు.. గుడ్స్ & సర్వీస్ ట్యాక్స్‌ను (జీఎస్టీ) గోపనీయ సూచనా పన్నుగా పేర్కొన్నట్టు చూపించారు. నిజానికి.. దాని ఒరిజినల్ వీడియో పూర్తిగా భిన్నమైనది. అందులో ఉన్న మహిళ ముఖాన్ని ఎడిట్ చేసి.. నిర్మలా ఫేస్‌తో మార్చేశారు. ఈ డీప్‌ఫేక్ వీడియోని చిరాగ్ పటేల్ అనే ఓ వ్యక్తి ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. దీంతో.. అది వైరల్ అయ్యింది. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో.. వాళ్లు వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకున్నారు. చిరాగ్ పటేల్ వ్యక్తిపై కేసు IT చట్టం 2000లోని సెక్షన్ 66E కింద కేసు నమోదు చేశారు.


ఈ వ్యవహారంపై గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఫేక్ వీడియోలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నకిలీ వీడియోని వ్యాప్తి చేసినందుకు.. చిరాగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ‘‘పౌరులను తప్పుదోవ పట్టించేందుకే ఈ ప్రయత్నం. ఇలాంటి మానిప్యులేటివ్ వ్యూహాలకు ఎవ్వరూ మోసపోకూడదు. డిజిటల్ స్పేస్‌లో సత్యం, జవాబుదారీతనానికి ప్రాధాన్యం ఇవ్వాలి’’ అంటూ సంఘవి తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Read Latest National News and Telugu News

Nirmala-Deepfake-Video.jpg

Updated Date - Jul 10 , 2024 | 07:09 PM