Share News

Dubai: దుబాయ్‌లో మళ్లీ జోరు వాన

ABN , Publish Date - May 03 , 2024 | 02:56 AM

ఎడారి దేశం యూఏఈ(యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌)ని వర్షాలు మళ్లీ హడలెత్తిస్తున్నాయి. దుబాయ్‌, అబుదాబీ సహా పలు ప్రాంతాల్లో గురువారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి.

Dubai: దుబాయ్‌లో మళ్లీ జోరు వాన

పలు విమాన సర్వీసులు రద్దు

దుబాయ్‌, మే 2: ఎడారి దేశం యూఏఈ(యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌)ని వర్షాలు మళ్లీ హడలెత్తిస్తున్నాయి. దుబాయ్‌, అబుదాబీ సహా పలు ప్రాంతాల్లో గురువారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. గత నెలలో దుబాయ్‌ను ముంచెత్తిన భారీ వర్షాలతో పోలిస్తే తీవ్రత తక్కువే అయిన జాతీయ విపత్తు నిర్వహణ విభాగాలు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు చేశాయి. భారీ వర్షాల ప్రభావంతో గురువారం పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. మరికొన్ని సర్వీసులను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు.


అంతేకాక, దుబాయ్‌లో పలు రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. అంతర్గత బస్సు సర్వీసులను రద్దు చేశారు. పాఠశాలలు, విద్యా సంస్థలకు గురు, శుక్రవారాలు సెలవుగా ప్రకటించారు. అయితే, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు దుబాయ్‌ మెట్రో రైలు సర్వీసులను పెంచారు. కాగా, ఏప్రిల్‌ 14-15 తేదీల్లో కురిసిన కుంభవృష్టి వల్ల దుబాయ్‌లో ఓ ఏడాదిన్నరలో కురిసే వర్షం గంటలోనే కురిసింది. ఫలితంగా దుబాయ్‌ను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే.

Updated Date - May 03 , 2024 | 02:56 AM