Share News

Nirmala Sitharaman : హల్వా వేడుక

ABN , Publish Date - Jul 24 , 2024 | 05:58 AM

కేంద్ర బడ్జెట్‌కు ముందు హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీ. కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం బేస్‌మెంట్‌లో దీనిని నిర్వహిస్తారు.

Nirmala Sitharaman : హల్వా వేడుక

Nirmala Sitaraman : కేంద్ర బడ్జెట్‌కు ముందు హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీ. కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం బేస్‌మెంట్‌లో దీనిని నిర్వహిస్తారు. దీనిలో భాగంగా బడ్జెట్‌ పత్రాల ముద్రణలో పాలుపంచుకొనే 100 మంది అధికారులు, సిబ్బందికి ఆర్థిక మంత్రి హల్వా వడ్డిస్తారు. వీరందరికీ దాదాపు వారం పాటు నార్త్‌ బ్లాక్‌లో వసతి కల్పిస్తారు. ఆ సమయంలో మొబైల్‌ ఫోన్‌ ఉపయోగించే అవకాశం కూడా ఉండదు. బడ్జెట్‌ లీక్‌ కాకూడదనే ఉద్దేశంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటారు.

Updated Date - Jul 24 , 2024 | 06:01 AM