Share News

Ranchi: గాండే అసెంబ్లీకి కల్పనా సోరెన్‌ నామినేషన్‌

ABN , Publish Date - Apr 30 , 2024 | 04:26 AM

ఝార్ఘండ్‌లోని గాండే అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో జేఎంఎం తరఫున మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌ పోటీ చేస్తున్నారు.

Ranchi: గాండే అసెంబ్లీకి కల్పనా సోరెన్‌ నామినేషన్‌

రాంచీ, ఏప్రిల్‌ 29: ఝార్ఘండ్‌లోని గాండే అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో జేఎంఎం తరఫున మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌ పోటీ చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్‌ అహ్మద్‌ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. మే 20న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు గాండే అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది.

Updated Date - Apr 30 , 2024 | 04:26 AM