Share News

Nepal: టేకాఫ్ అవుతుండగా కూలిన విమానం..!

ABN , Publish Date - Jul 24 , 2024 | 12:06 PM

నేపాల్ రాజధాని కాఠ్మాండూలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కాఠ్మాండూ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో ఆ విమానం కూలిపోయింది. ఆ విమానంలో మొత్తం 19 మంది ఉన్నారు. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను వెలికి తీశారు.

Nepal: టేకాఫ్ అవుతుండగా కూలిన విమానం..!
Plane Crashes During Take-Off

నేపాల్ రాజధాని కాఠ్మాండూలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కాఠ్మాండూ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో ఆ విమానం కూలిపోయింది. ఆ విమానంలో మొత్తం 19 మంది ఉన్నారు. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. కాఠ్మాండూలోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బుధవారం ఉదయం శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బయల్దేరింది.


విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో క్రాష్ అయింది. దాంతో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. ఆ విమానంలో సిబ్బందితో సహా మొత్తం 19 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో విమానం మొత్తం దగ్ధమైంది. దీంతో ఆ విమానంలో ఉన్న 19 మందిలో 18 మంది మరణించారు. విమాన పైలెట్ తీవ్ర గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎమ్‌ఆర్ సఖ్యగా గుర్తించి సిబ్బంది, అతడిని విమానం నుంచి బయటకు తీసి కాఠ్మాండూ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు.


పైలెట్‌కు కంటిపై గాయాలు అయినట్టు తెలుస్తోంది. చికిత్స అనంతరం అతడు కోలుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సమాచారం ప్రకారం. ఆ విమానం రన్ వైపై వెళుతుండగా జారిపోయి దాని రెక్క కిందకు తగిలింది. దీంతో మంటలు చెలరేగాయి. విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత ఆ మంటలు మరింత పెద్దవై విమానం క్రాష్ అయిపోయింది. ఆ విమానం స్థానిక శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందినది. కాగా, ఇటీవలి కాలంలో నేపాల్‌లో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బడ్జెట్ కొరత కారణంగా సరైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, అక్కడి అననుకూల పరిస్థితులు ఈ ప్రమాదాలకు కారణాలు. అక్కడ రన్ వేలు మంచుతో నిండిన కొండల మధ్యలో ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో విమానాలను నడపడం బాగా అనుభవం ఉన్న పైలెట్లకు కూడా కత్తి మీద సామే అని నిపుణులు పేర్కొంటున్నారు.

Updated Date - Jul 24 , 2024 | 01:22 PM