Puri Ratna Bhandar: పూరీలో తెరుచుకున్న రత్నభాండాగారం.. లోపలకి వెళ్లిన బృందం
ABN , Publish Date - Jul 14 , 2024 | 02:09 PM
పూరీ జగన్నాథ స్వామి రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ ఆధివారం ప్రారంభమైంది. ఆ క్రమంలో ఆలయ పూజారులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. మరికాసేపట్లో రత్న భాండాగారాన్ని అధికారులు తెరవనున్నారు.
భువనేశ్వర్, జులై 14: పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో దాదాపు 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరచుకుంది. ఆలయ పూజారులు ప్రత్యేక పూజల అనంతరం రత్న భాండాగారాన్ని అధికారులు తెరిచారు. ఈ రత్నభాండాగారాన్ని మధ్యాహ్నం 1.28 గంటలకు తెరిచారు. మూడో గదిలోకి 11 మందితో కూడిన ఒక బృందం వెళ్లింది. ఆ గదిలోని నిధిని బయటకు తీసుకొచ్చేందుకు ఆరు భారీ పెట్టెలను భాండాగారంలోకి తీసుకెళ్లారు. ఈ పూరీ రత్నభాండాగారంలో మొత్తం మూడు గదులున్నాయి. వాటిలో మొదటి గదిని స్వామి వారికి పూజలో భాగంగా ప్రతీ రోజు తీస్తారు. ఇక రెండో గదిని అతి ముఖ్య సందర్భాల్లో మాత్రమే తెరుస్తారు.
ఆ యా రోజుల్లో స్వామి వారికి ఆ గదిలోని విలువైన నగలను అలంకరిస్తారు. అయితే మూడో గదిని మాత్రం 46 ఏళ్ల క్రితం తెరిచారు. అంటే.. ఈ గదిని 1978లో తెరిచారు. అనంతరం మళ్లీ తెరవలేదు. దీంతో ఆ గదిలో అంతులేని సంపద ఉందని తెలుస్తుంది. ఈ గదికి నాగ బంధం కూడా ఉండడంతో.. అన్ని రక్షణ చర్యలు తీసుకున్నారు. ఇక ఆ గదిలో నిధులు, నిక్షేపాలకు రక్షణగా పాములున్నాయని సమాచారం.
బృందంలో పాములు పట్టే వ్యక్తులు ఉన్నారు. అలాగే ఎలాంటి అత్యవసర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు వైద్యులను కూడా అందుబాటులో ఉంచారు. రత్నభాండాగారం తెరిచే ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆ యా పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
రత్నభాండాగారంలోని సంపదను ఆ యా పెట్టెల్లో కమిటీ సభ్యులు భద్రపరచున్నారు. అందుకోసం ఆ పెట్టలను భాండాగారంలోకి తీసుకు వెళ్లారు. అలాగే ఆ యా ఆభరణాలను డిజిటల్ డాక్యుమెంటేషన్ చేసి.. అనంతరం వాటిని అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేశారు. 1978లో ఈ భాండాగారంలో సంపదను లెక్కించేందుకు 72 రోజుల సమయం పట్టిందని సమాచారం.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News