Share News

Hajj Pilgrimage : 1,300 దాటిన హజ్‌ మృతుల సంఖ్య

ABN , Publish Date - Jun 25 , 2024 | 03:25 AM

ఈ ఏడాది హజ్‌ యాత్రలో మృతిచెందిన వారి సంఖ్య 1,300 దాటినట్లు సౌదీ అధికార వర్గాలు ఆదివారం ప్రకటించాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల వల్లే ఈ మరణాలు సంభవించినట్లు పేర్కొన్నాయి.

 Hajj Pilgrimage : 1,300 దాటిన హజ్‌ మృతుల సంఖ్య

కైరో, జూన్‌ 24: ఈ ఏడాది హజ్‌ యాత్రలో మృతిచెందిన వారి సంఖ్య 1,300 దాటినట్లు సౌదీ అధికార వర్గాలు ఆదివారం ప్రకటించాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల వల్లే ఈ మరణాలు సంభవించినట్లు పేర్కొన్నాయి. చనిపోయిన వారికి సంప్రదాయం ప్రకారం మక్కాలో అంత్యక్రియలు నిర్వహించామని సౌదీ ఆరోగ్య మంత్రి ఫహద్‌ బిన్‌ అబ్దురహ్మాన్‌ అల్‌ జలజిల్‌ పేర్కొన్నారు. కొంతమంది భక్తులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఎలాంటి పత్రాలు లేకపోవడం వల్ల మృతుల గుర్తింపు ప్రక్రియ ఆలస్యమవుతోందని వివరించారు.

Updated Date - Jun 25 , 2024 | 03:28 AM