WHO : భారత్‌లో బర్డ్ ఫ్లూ రెండో కేసు
ABN , Publish Date - Jun 13 , 2024 | 04:59 AM
భారత్‌లో బర్డ్ ఫ్లూ రెండో కేసును గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్‌వో) ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో నాలుగేళ్ల బాలికలో హెచ్9ఎన్2 వైరస్ ద్వారా సోకే బర్డ్
న్యూఢిల్లీ, జూన్ 12: భారత్‌లో బర్డ్ ఫ్లూ రెండో కేసును గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్‌వో) ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో నాలుగేళ్ల బాలికలో హెచ్9ఎన్2 వైరస్ ద్వారా సోకే బర్డ్ ఫ్లూని గుర్తించినట్లు తెలిపింది. ‘‘ఆ బాలికని తీవ్రమైన శ్వాస సమస్యలు, జ్వరం, కడుపు నొప్పితో ఫిబ్రవరి నెలలో ఓ స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. వ్యాధి నిర్ధారణ తర్వాత చికిత్స చేసి మూణ్నెళ్ల తర్వాత బాలికను డిశ్చార్జ్ చేశారు’’ అని డబ్ల్యూహెచ్‌వో తాజాగా వెల్లడించింది. 2019లో తొలిసారి హెచ్9ఎన్2 బర్డ్ ఫ్లూ కేసుని భారత్‌లో గుర్తించినట్లు తెలిపింది.