Share News

Ratna bhandar puri: రత్న భాండాగారం నుంచి నగలు బయటకు తరలింపు.. కీలక ప్రకటన

ABN , Publish Date - Jul 14 , 2024 | 07:00 PM

యావత్ దేశం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరిచే ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. సుమారు 46 ఏళ్ల తర్వాత భాండాగారంలోని విలువైన నగలు, బంగారు ఆభరణాలను 11 మందితో కూడిన ప్రత్యేక బృందం బయటకు తీసుకొచ్చింది.

Ratna bhandar puri: రత్న భాండాగారం నుంచి నగలు బయటకు తరలింపు.. కీలక ప్రకటన
Puri Ratna Bandagar

భువనేశ్వర్: యావత్ దేశం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరిచే ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. సుమారు 46 ఏళ్ల తర్వాత భాండాగారంలోని విలువైన నగలు, బంగారు ఆభరణాలను 11 మందితో కూడిన ప్రత్యేక బృందం బయటకు తీసుకొచ్చింది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన పెట్టెల ద్వారా వాటిని వెలుపలకు తీసుకొచ్చామని ‘శ్రీ జగన్నాథ్ ఆలయం’ చీఫ్ అరబింద పధే ప్రకటించారు. లోపలి ఛాంబర్ తెరిచే ఉంటుందని, పూర్తి ప్రక్రియను ముగించేందుకు తేదీలు ప్రకటిస్తామని చెప్పారు. కాగా పొద్దుపోవడంతో నేడు (ఆదివారం) నగల విలువ లెక్కింపును అధికారులు నిలిపివేశారు. అయితే ఎప్పుడు లెక్కిస్తారనేది తెలియాల్సి ఉంది.


కాగా రత్న భాండాగారంలోని మూడవ గది తలుపు తాళం పనిచేయకపోవడంతో యంత్రంతో కట్ చేసి తెరిచినట్టు తెలుస్తోంది. కాగా తలుపులు తెరిచిన తర్వాత గది నుంచి గబ్బిళాలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చాయి. మరోవైపు రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ నిబంధనల ప్రకారం సవ్యంగా జరిగిందని పూరీ ఎస్పీ ప్రకటించారు.


మంచి ముహూర్తం చూసి.. తలుపులు తెరచి..

పూరీ జగన్నాథ స్వామి ఆలయ రత్న భాండాగానాన్ని ఆదివారం మధ్యాహ్నం మధ్యాహ్నం 1.28 గంటలకు తెరిచారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజల అనంతరం దాదాపు 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరచుకుంది. మూడో గదిలోకి 11 మందితో కూడిన బృందం ప్రవేశించింది. నిధి కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన పెట్టలు, తాళం ఓపెన్ కాకుంటే తెరచేందుకు ప్రత్యేకమైన యంత్రాలను తీసుకెళ్లారు.

Updated Date - Jul 14 , 2024 | 07:06 PM