Share News

Shocking Video: సముద్ర దొంగల ఆధీనంలో బంగ్లా షిప్.. కాపాడేందుకు వెళ్లిన భారత నేవీపై కాల్పులు.. షాకింగ్ వీడియో వైరల్!

ABN , Publish Date - Mar 16 , 2024 | 01:41 PM

ఇండియన్ నేవీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఇండియన్ నేవీ హెలీకాఫ్టర్‌పై సముద్రపు దొంగలు తుపాకీతో దాడి చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో అది.

Shocking Video: సముద్ర దొంగల ఆధీనంలో బంగ్లా షిప్.. కాపాడేందుకు వెళ్లిన భారత నేవీపై కాల్పులు.. షాకింగ్ వీడియో వైరల్!

ఇండియన్ నేవీ (Indian Navy) సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఇండియన్ నేవీ హెలీకాఫ్టర్‌పై సముద్రపు దొంగలు (Somali pirates) తుపాకీతో దాడి చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో అది. బంగ్లాదేశ్‌కు చెందిన బల్క్ క్యారియర్ ఎంవీ రాయెన్ ఓడను సోమాలియా సముద్రపు దొంగలు గత ఏడాది డిసెంబర్ 14న హైజాక్ చేశారు. ఆ షిప్ నుంచి తాజాగా భారత నేవీకి ఓ సందేశం వచ్చింది (Ship Hijack).

హైజాక్ అయిన ఆ కార్గో షిప్‌ను గుర్తించిన ఇండియన్ నేవీ మార్చి 15వ తేదీన ఓ ఛాపర్‌ను పంపించింది. ఆ ఛాపర్‌పై సముద్రపు దొంగలు దాడికి దిగారు. ఓ పైరేట్ ఓడ నుంచి కాల్పులు జరపడం వీడియోలో కనిపిస్తోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. ఆత్మ రక్షణ కోసం, సముద్రపు దొంగలను ఎదుర్కోవడం కోసం, వారిని న్యూట్రలైజ్ చేయడం కోసం చాలా తక్కువ శక్తితో ఇండియన్ నేవీ కాల్పులు జరిపింది. ఓడను విడిచిపెట్టాలని, బందీలుగా ఉన్న పౌరులను విడిచిపెట్టాలని ఇండియన్ నేవీ సముద్రపు దొంగలను కోరింది.

Updated Date - Mar 16 , 2024 | 01:41 PM