Share News

Puri: రత్నభాండాగారాన్ని తెరిచిన ఎస్పీకి అస్వస్థత

ABN , Publish Date - Jul 14 , 2024 | 04:49 PM

పూరీ జగన్నాథుడి రత్నభాండాగారాన్ని(Puri Ratna Bhandar) ఒడిశా అధికారుల బృందం ఆదివారం విజయవంతంగా బయటకి తీసుకువచ్చింది. బయటకి తెచ్చిన వెంటనే సిబ్బంది భాండాగార పెట్టెలను శుభ్రం చేశారు.

Puri: రత్నభాండాగారాన్ని తెరిచిన ఎస్పీకి అస్వస్థత

భువనేశ్వర్: పూరీ జగన్నాథుడి రత్నభాండాగారాన్ని(Puri Ratna Bhandar) ఒడిశా అధికారుల బృందం ఆదివారం విజయవంతంగా బయటకి తీసుకువచ్చింది. బయటకి తెచ్చిన వెంటనే సిబ్బంది భాండాగార పెట్టెలను శుభ్రం చేశారు.

అయితే రత్నభాండాగార సమీపంలో ఎస్పీ పినాక్ మిశ్రా అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో ఆయనను ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన హెల్త్‌ క్యాంప్‌‌నకు తరలించారు. డాక్టర్‌ సీబీకే మహంతి ఆయనకు చికిత్స అందిస్తున్నారు.


ఎస్పీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ సిఫార్సులతో ఈ ప్రక్రియను చేపట్టారు. నిధిని చెక్క పెట్టెల్లో తరలించారు. ఈ నిధిని చివరిసారిగా 1978లో తెరిచారు. తలుపులు తెరిచేందుకు ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి విశ్వనాథ్ రథ్, జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధీతోపాటు ASI సూపరింటెండెంట్ లోపలికి వెళ్లారు. వీళ్లతోపాటు నలుగురు సహాయకులు వెళ్లినట్లు సమాచారం.

Updated Date - Jul 14 , 2024 | 04:56 PM