Share News

UPSC: యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామా!.. పూజా ఖేడ్కర్ వివాదం వేళ అనూహ్య పరిణామం

ABN , Publish Date - Jul 20 , 2024 | 11:01 AM

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ అంశం తెరపైకి వచ్చిన తర్వాత యూపీఎస్సీ చుట్టూ ఉన్న వివాదాలు, ఆరోపణలకు ఆయన రాజీనామాతో సంబంధం లేదని సోనీ సన్నిహితులు చెబుతున్నారు.

UPSC: యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామా!.. పూజా ఖేడ్కర్ వివాదం వేళ అనూహ్య పరిణామం

ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ అంశం తెరపైకి వచ్చిన తర్వాత యూపీఎస్సీ చుట్టూ ఉన్న వివాదాలు, ఆరోపణలకు ఆయన రాజీనామాతో సంబంధం లేదని సోనీ సన్నిహితులు చెబుతున్నారు. ఆయన వ్యక్తిగత కారణాలతోనే 15 రోజుల క్రితం రాజీనామాను సమర్పించారని.. కేంద్ర ప్రభుత్వం రాజీనామాను ఇంకా ఆమోదించలేదని తెలిపారు.


సోనీ యూపీఎస్సీ ఛైర్మన్‌గా ఉండటానికి ఆసక్తి చూపడం లేదని, రిలీవ్ కావాలనుకుంటున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజీనామా అనంతరం సామాజిక సేవ, మతపరమైన కార్యకలాపాలకు అంకితం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే సోనీ పదవీకాలం 2029తో ముగియనుంది. 2023 ఏప్రిల్‌లోనే బాధ్యతలు చేపట్టిన ఆయన పదవీకాలం ముగియకముందే రాజీనామా చేయడం గమనార్హం.


గతంలో వైస్ ఛాన్సలర్‌గా..

యూపీఎస్సీలో నియామకానికి ముందు సోని మూడు పర్యాయాలు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. వీటిలో గుజరాత్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (BAOU) VCగా ఆగస్టు 1, 2009 నుంచి జులై 31, 2015 వరకు వరుసగా రెండు పర్యాయాలు విధులు నిర్వహించారు. 2005 ఏప్రిల్ నుంచి 2008 ఏప్రిల్ వరకు బరోడా మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం (MSU) VCగా ఉన్నారు. MSUలో పని చేస్తున్న సమయంలో.. సోనీ దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్. 1991 - 2016 మధ్య కాలంలో సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయం (SPU), వల్లభ్ విద్యానగర్‌లో అంతర్జాతీయ సంబంధాల పాఠాలను బోధించారు.

For Latest News and National News click here

Updated Date - Jul 20 , 2024 | 01:34 PM