Share News

UPSC Prelims 2024: ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ

ABN , Publish Date - Jul 01 , 2024 | 08:38 PM

సివిల్స్ ప్రిలిమ్స్-2024 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం విడుదల చేసింది. ఆ ఫలితాలను తన అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.inలో ఉంచింది.

UPSC Prelims 2024: ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ
UPSC New Delhi

న్యూఢిల్లీ, జులై 01: సివిల్స్ ప్రిలిమ్స్-2024 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సోమవారం విడుదల చేసింది. ఆ ఫలితాలను తన అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.inలో ఉంచింది. ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను జూన్ 16వ తేదీన దేశవ్యాప్తంగా యూపీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 400 మార్కులతో అన్ని అబ్జెక్టివ్ ప్రశ్నలతో రెండు పేపర్లగా ఈ పరీక్ష నిర్వహించారు.

Also Read: Who is Awadhesh Prasad: రాహుల్ గాంధీ ‘ఆయనకు’ ఎందుకు షేక్‌హ్యాండ్ ఇచ్చారు?

Also Read: INDIA Bloc: మోదీ ప్రభుత్వ తీరుపై ఎంపీలు ఆందోళన


ఈ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు.. మెయిన్స్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ మెయిన్స్ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధిస్తే.. ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు గతేడాది సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష మే 26వ తేదీన నిర్వహిస్తే.. జూన్ 12న ఫలితాలు విడుదల చేసిన విషయం విధితమే.

Also Read: Engineer Rashid: ఎంపీగా ప్రమాణానికి ఎన్ఐఏ ఓకే.. తేదీ ఎప్పుడంటే..?

Also Read: Viral Video: ‘ఆ వీడియో’పై సీఎంను నివేదిక కోరిన గవర్నర్

Also Read: Australia: స్టూడెంట్ వీసా ఛార్జీలు భారీగా పెంపు.. ఈ రోజు నుంచి అమలు

Also Read: Ashwini Vaishnaw: రాహుల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

Also Read: AP: పలువురు పోలీస్ ఉన్నతాధికారులు మాతృశాఖకు బదిలీ

For More National News and Latest Telugu News click here

Updated Date - Jul 01 , 2024 | 08:40 PM