Share News

Lok Sabha Polls: యూపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. మాయవతి, అఖిలేష్ మధ్య మాటల యుద్ధం..

ABN , Publish Date - May 09 , 2024 | 10:20 AM

ఉత్తరప్రదేశ్‌‌లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ప్రధాన పోరు కొనసాగుతున్న వేళ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. బీఎస్పీ అధినేత్రి మాయావతిని టార్గెట్ చేశారు. మరోవైపు అఖిలేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాయావతి. బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను మాయావతి తప్పించారు. ఏడాది క్రితం ఇచ్చిన వారసత్వ బాధ్యతల నుంచి కూడా తప్పించినట్లు ప్రకటించారు. దీంతో మాయావతి తీసుకున్న ఈ నిర్ణయంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Lok Sabha Polls: యూపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. మాయవతి, అఖిలేష్ మధ్య మాటల యుద్ధం..
Mayawati and Akilesh

ఉత్తరప్రదేశ్‌‌లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ప్రధాన పోరు కొనసాగుతున్న వేళ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. బీఎస్పీ అధినేత్రి మాయావతిని టార్గెట్ చేశారు. మరోవైపు అఖిలేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాయావతి. బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను మాయావతి తప్పించారు. ఏడాది క్రితం ఇచ్చిన వారసత్వ బాధ్యతల నుంచి కూడా తప్పించినట్లు ప్రకటించారు. దీంతో మాయావతి తీసుకున్న ఈ నిర్ణయంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మాయావతి నిర్ణయాన్ని పార్టీ అంతర్గత అంశంగా పేర్కొంటూనే ఇప్పుడు ఏం చేసినా లాభం లేదని, ప్రస్తుతం గేమ్ బీఎస్పీ చేతల్లో లేదని వ్యాఖ్యానించారు. అఖిలేష్ ట్వీట్‌పై మాయావతి అదే స్థాయిలో స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ తన కుటుంబ సభ్యులు, యాదవ్ సంఘం అభ్యర్థుల పరిస్థితి గురించి ఆందోళన చెందుతోందని, వాళ్ల పరిస్థితి దారుణంగా ఉందని కౌంటర్ ఇచ్చారు. యూపీలో ఏడు దశల్లో 80 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. మూడు విడతల్లో 26 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. 54 స్థానాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఎస్పీ బీఎస్పీని టార్గెట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది.

హిందూ జనాభా తగ్గుముఖం..


అఖిలేష్ ఏం చెప్పారు..

బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి ఆకాష్‌ను తప్పించడంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. అది పార్టీ అంతర్గత విషయమన్నారు. వాస్తవానికి బీఎస్పీకి ఒక్క సీటు కూడా రాదనడానికి ఈ మార్పు ఓ కారణమని అన్నారు. బీఎస్పీకి చెందిన చాలా మంది సాంప్రదాయ మద్దతుదారులు రాజ్యాంగం, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ఈసారి ఇండియా కూటమికి ఓటు వేస్తున్నారని అన్నారు. బీఎస్పీ దీన్ని పార్టీ వైఫల్యంగా పరిగణిస్తోందని.. అందుకే అగ్రనాయకత్వం పెద్దఎత్తున మార్పులు చేర్పులు చేస్తోందన్నారు. ప్రస్తుతం గేమ్ బీఎస్పీ చేతుల్లో లేకుండా పోయిందని, నిజానికి బీఎస్పీకి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో గత మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కదని జోస్యం చెప్పారు. మిగిలిన నాలుగు దశల్లోనూ బీఎస్పీకి ఎలాంటి అవకాశం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఓటును వృధా చేసుకోవద్దని, బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు ముందుండి పోరాడుతున్న ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని, రాజ్యాంగంతో పాటు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అఖిలేష్ యాదవ్ కోరారు.

Election Commission: ఐదో దశలో 695 మంది అభ్యర్థులు..


ఎస్పీపై ఫైర్..

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై మాయావతి ఫైర్ అయ్యారు. ఆ పార్టీ స్వభావం ఎప్పటికీ దళితులకు వ్యతిరేకమన్నారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఎస్పీ వ్యతిరేకమని, పదోన్నతుల్లో రిజర్వేఫన్లు రద్దు చేయడం, పార్లమెంట్‌లో బిల్లులు చించివేయడం వంటివాటిని ప్రజలు క్షమించబోరన్నారు.

బహుజన సమాజంలో పుట్టిన మహానుభావుల గౌరవార్థం ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాలు, పార్కులు, యూనివర్సిటీల పేర్లు మారుస్తున్నాయని ఆరోపించారు. తమపట్ల సానుభూతి అవసరం లేదని, ఎస్పీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తే మంచిదని మాయావతి సూచించారు.


ఈ ఎన్నికల్లో..

గతంలో ఉత్తరప్రదేశ్ రాజకీయం బీఎస్పీ, ఎస్పీ చుట్టూ తిరిగేది. ఈ రెండు పార్టీలే ఈ రాష్ట్రంలో ప్రభావవంతమైన పార్టీలుగా ఉండేవి. బీజేపీ ఈ రాష్ట్రంలో పుంజుకోవడం, వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడంతో ఎస్పీ, బీఎస్పీ ప్రభావం తగ్గింది. దీంతో కాంగ్రెస్, ఎస్పీ కలిసి పోటీచేస్తున్నాయి. ఇండియా కూటమితో తమకు లబ్ధి చేకూరుతుందని ఎస్పీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీచేసినా తమకు నష్టం కలగలేదని, ఈ లెక్కల ప్రకారం కాంగ్రెస్, ఎస్పీ కలిసినా తమకు పోయేదేమి లేదని బీజేపీ నేతలు అంటున్నారు. అసలు ఫలితం తెలియాలంటూ జూన్4 వరకు వేచి ఉండాల్సిందే.


Supreme Court: విచారణ సమయంలో రాజకీయాలు చేయొద్దు.. పశ్చిమబెంగాల్ కేసులో సుప్రీం సూచన

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest News and National News click here..

Updated Date - May 09 , 2024 | 11:40 AM