Diksuchi : హడ్కోలో మేనేజీరియల్ ఉద్యోగాలు
ABN , Publish Date - Aug 02 , 2024 | 05:56 AM
ఢిల్లీలోని హౌజింగ్ అండ్ అర్బన్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హడ్కో)... ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Diksuchi : ఢిల్లీలోని హౌజింగ్ అండ్ అర్బన్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హడ్కో)... ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 66
1.సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: 1 పోస్టు
2. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: 1 పోస్టు
3. జనరల్ మేనేజర్: 1 పోస్టు
4. డిప్యూటీ జనరల్ మేనేజర్: 2 పోస్టులు
5. అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 11 పోస్టులు
6. సీనియర్ మేనేజర్: 12 పోస్టులు
7. మేనేజర్: 5 పోస్టులు
8. ట్రెయినీ ఆఫీసర్: 33 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, సీఏ, బీఈ/బీటెక్/బీఎస్సీ, ఎంబీఏ, పీజీప ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 నుంచి 52 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు ఫీజు: మేనేజీరియల్ పోస్టులకు రూ.1500; ట్రెయినీ ఆఫీసర్ పోస్టుకు రూ.1,000; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 11
వెబ్సైట్: https://hudoco.org.in//