Health : రక్త శుద్ధి సులువే!
ABN , Publish Date - Sep 10 , 2024 | 02:10 AM
రక్తంలో ఇన్ఫెక్షన్లు ఆరోగ్యాన్ని గుల్ల చేస్తాయి. రోగ కారకాలు రక్తంలోకి చొరబడినా, ఎప్పటికప్పుడు నశించి ఆరోగ్యం క్షేమంగా ఉండాలంటే అందుకు తోడ్పడే పదార్థాలతో రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అందుకోసం...
మీకు తెలుసా?
రక్తంలో ఇన్ఫెక్షన్లు ఆరోగ్యాన్ని గుల్ల చేస్తాయి. రోగ కారకాలు రక్తంలోకి చొరబడినా, ఎప్పటికప్పుడు నశించి ఆరోగ్యం క్షేమంగా ఉండాలంటే అందుకు తోడ్పడే పదార్థాలతో రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అందుకోసం...
బీట్రూట్: యాంటీఆక్సిడెంట్లు, నైట్రేట్స్ కలిగి ఉండే బీట్రూట్ రక్తాన్ని డిటాక్సిఫై చేసి, నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దాంతో రక్తనాళాలు విప్పారి, రక్తప్రసరణ మెరుగవుతుంది.
వెల్లుల్లి: సల్ఫర్ కాంపౌండ్స్ను కలిగి ఉండే వెల్లుల్లి సహజసిద్ధ రక్తశుద్ధి గుణాలను కలిగి ఉంటుంది. అదనపు కొవ్వులను రక్తం నుంచి తొలగించి, విసర్జించేలా చేయడం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులను తగ్గిస్తుంది.
నిమ్మ: విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉండే నిమ్మ సహజసిద్ధ రక్తశుద్ధికి సహాయపడుతుంది. రక్తంలోని వ్యర్థాలను తొలగించి, కాలేయ డిటాక్సిఫికేషన్కు తోడ్పడుతుంది. కాబట్టి తరచూ నిమ్మరసాన్ని ఆహార పదార్థాలకు జోడిస్తూ ఉండాలి.
పసుపు: పసుపులోని కుర్క్యుమిన్ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఈ యాంటీఆక్సిడెంట్ రక్తాన్ని డిటాక్సిఫై చేసి, కాలేయ పనితీరును మెరుగు పరుస్తుంది.
దానిమ్మ: రక్తాన్ని శుద్ధి చేసే ఏకైక పండు ఇది. దీన్లోని యాంటీఆక్సిడెంట్స్ అయిన ప్యూనికలాజిన్స్, విటమిన్ సిలు శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి తప్పిస్తాయి. రక్తశుద్ధికి దోహదపడతాయి. రక్తప్రసరణను మెరుగు పరుస్తాయి.
ఆకుకూరలు: బచ్చలి కూర, కేల్, ఇతరత్రా ఆకుకూరలన్నింట్లో పత్రహరితం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోని విషాలను బయటకు వెళ్లగొట్టి ఆక్సిజన్ మోతాదులను పెంచుతుంది. ఫలితంగా రక్తం శుద్ధి అవుతుంది.