Biotin Rich Foods : ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం కోసం బయోటిన్ రిచ్ ఫుడ్స్ వీటిని తీసుకుంటే..
ABN , Publish Date - Jun 27 , 2024 | 02:54 PM
రక్తంలో చక్కెర నియంత్రణ బయోటిన్ ద్వారా వీలవుతుంది. ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారు, వ్యాధి వచ్చే ప్రమాదం ఉన్నారు దీని మీద శ్రద్ధ వహించాలి.
జుట్టు, చర్మం కోసం విటమిన్ బి7 లేదా బయోటిన్ నీటిలో కరిగే విటమిన్ ఇది బలమైన, ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోళ్ల కోసం అవసరం. బయోటిన్ కొరత ఎప్పుడో కానీ జరగదు. కానీ ఈ విటమిన్ శరీరంలో లేనప్పుడు మాత్రం దద్దుర్లు, జుట్టు రాలడం, ఇతర లక్షణాలు కలిపిస్తాయి. బయోటిన్ ప్రసిద్ధ ఆరోగ్య ప్రయోజనాల్లో ఒకటి. ఆహారం నుంచి బయోటిన్ పొందడం ముఖ్యం. దీని కోసం తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..
బయోటిన్, విటమిన్ ఇ, కెరానాట్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి3, విటమిన్ బి5, బి6, బి7, బి12 సమర్థవంతంగా అందజేస్తుంది. బయోటిన్, విటమిన్ బి7 లేదా విటమిన్ హెచ్ అని కూడా పిలుస్తారు. ఇది వివిధ జీవక్రియలకు కీలకమైన నీటిలో కరిగే విటమిన్. కొవ్వు ఆమ్లాల ఉత్పత్తికి ఇది అవసరం. ఆరోగ్యకరమైన కణాలు, కణజాలాలను నిర్వహించడానికి ఇది అవసరం. మామూలుగా బయోటిన్ శరీరంలో తగ్గే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో ముఖ్యంగా తగ్గుతుంది. అవి గర్భం సమయంలో, అలాగే ధూమపానం, మద్యపానం, కొన్ని రకాల మందులను వాడుతున్నప్పుడు ఈ పరిస్థితులలో శరీరంలో బయోటిన్ లోపం ఏర్పడుతుంది. జుట్టు రాలడం, చర్మంపై దద్దుర్లు, అలసట, డిప్రెషన్ వంటి నరాల లక్షణాలు బయోటిన్ లోపం కారణంగా కనిపించే సంకేతాలు.
బయోటిన్ ప్రయోజనాలు..
జుట్టు, చర్మం, గోళ్ల ఆరోగ్యాన్ని పెంచుతుంది. ప్రోటీన్లు, లిపిడ్లు, కార్బోహైడ్రేట్ల జీవక్రియ బయోటిన్ పై ఆధారపడి ఉంటుంది. శరీర కణాల నిర్వహించడంలో కూడా బయోటిన్ అవసర పడుతుంది.
జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు బయోటిన్ అవసరం. ఒకవేళ జుట్టు రాలిపోతుంది అంటే అది లోపించిందనే అర్థం చేసుకోవాలి.
Herbs And Spices : కిడ్నీ, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఇవే..
గర్భిణీ స్త్రీలలో బయోటిన్ అవసరం ఎక్కవగా ఉంటుంది. కాబోయే తల్లి, పుట్టే బిడ్డా ఇద్దరికీ ఇది చాలా అవసరం.
తల్లి పాల ద్వారా శిశువు ఆరోగ్యాంగా ఉంటుంది. దీనికి బయోటిన్ కీలకం. శిశువు ఎదుగుదలకు అభివృద్ధికి తల్లిపాలలో బయోటిన్ తగినంత మోతాదులో ఉండాలి.
రక్తంలో చక్కెర నియంత్రణ బయోటిన్ ద్వారా వీలవుతుంది. ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారు, వ్యాధి వచ్చే ప్రమాదం ఉన్నారు దీని మీద శ్రద్ధ వహించాలి.
బయోటిన్ జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. బయోటిన్ తగినంత మొత్తంలో లేకపోతే జీర్ణశయాంతర ప్రేగు వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.
vitamin E Foods : జుట్టు పెరుగుదలకు అడ్డేలేదు, ఈ 7 విటమిన్ ఇ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే చాలట...!
బయోటిన్ అధికంగా ఉండే ఆహారాలు..
గుడ్లు, అవకాడో, చిలగడ దుంపలు, బచ్చలి కూర, బాదం, పొద్దుతిరుగుడు గింజలు, తృణధాన్యాలు, వేరుశనగలు, క్యారెట్లు, కాలీఫ్లవర్, అరటి పండ్లు, హోల్ వీట్ బ్రెడ్..
బయోటిన్ లోపం లక్షణాలు..
జుట్టు రాలడం, చర్మం పై దద్దుర్లు, పెళుసుగా ఉండే గోర్లు, అలసట, నిరాశ, అవయవాలలో జలదరింపు వంటి లక్షణాలు ఉంటాయి.
పెద్దలకు ప్రతిరోజూ 30 మైక్రోగ్రాముల బయోటిన్ తీసుకోవాలి. గర్భవతులు అయిన స్త్రీలకు అదనంగా అవసరపడుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.