Share News

Liver Health : కాఫీ తాగి లివర్ కొలెస్ట్రాల్‌కి చెక్ పెట్టండి..!

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:27 PM

కాలేయం విషయంలో చిన్న ఇబ్బంది మొదలైనా కూడా శరీరం తీవ్ర అనారోగ్యానికి గురవుతుంది. దీనికి ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం, జీవన అలవాట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిలోని మార్పుల కారణంగానే చాలా మందిలో ఫ్యాటీ లివర్ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.

Liver Health : కాఫీ తాగి లివర్ కొలెస్ట్రాల్‌కి చెక్ పెట్టండి..!
Your Liver

కాఫీ తాగడం అందరూ ఉదయాన్నే చేసే ఇష్టమైన పని. కమ్మి కప్పు కాఫీతో ఉదయాన్ని మొదలుపెట్టేవారు చాలామందే ఉంటారు. కాఫీ అతిగా తాగే వారు కూడా ఉండకపోరు. అయితే కాఫీ తాగడం వల్ల లివర్ కొలెస్ట్రాల్ విషయంలో మంచి రిజల్ట్ ఉంటుందట. అదేమిటి కాఫీ అలవాటు మంచిది కాదంటారు కాదా అంటే అదే తెలుసుకుందాం.

మన శరీరంలో అతిపెద్ద అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది శరీరానికి కావాల్సిన అనేక విధులను నిర్వహిస్తూ ఉంటుంది. అందుకే కాలేయ ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. కాలేయం విషయంలో చిన్న ఇబ్బంది మొదలైనా కూడా శరీరం తీవ్ర అనారోగ్యానికి గురవుతుంది. దీనికి ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం, జీవన అలవాట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిలోని మార్పుల కారణంగానే చాలా మందిలో ఫ్యాటీ లివర్ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.

ఎటువంటి ఆహారాలను తీసుకుంటే ఇబ్బంది పడతారు..

ఎక్కువగా నూనెలో వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్స్, అధిక బరువుతో ఉండటం కారణంగా కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. ఆహారంతోపాటు, జీవన శైలి అలవాట్లు కూడా ఈ సమస్యను పెంచుతాయి. సరైన సమయానికి భోజనం చేయకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, ఒత్తిడి ఇలా చాలా సమస్యలతో ఫ్యాటీలివర్ సమస్యలుంటాయి. అయితే ఫ్యాటీ లివర్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, రెండు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి.

Eyesight Tips : ఈ చిట్కాలు పాటించారంటే.. కళ్ళద్దాలతో పనే ఉండదు..!


లక్షణాలు..

1. ఫ్యాటీ లివర్ సమస్య ఉండే కనుక కడుపులో కుడి పక్కన విపరీతమైన నొప్పి ఉంటుంది.

2. కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారి ఉంటాయి. చర్మం మీద చికాకు, దురద ఉంటుంది.

3. పాదాల్లోకి నీరు చేరడం, యూరిన్ పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.

4. అలసట, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కూడా ఉంటాయి.

Healthy Food : బియ్యానికి బదులుగా గోధుమ రవ్వను తీసుకుంటే..!

కాఫీతో ఎలాంటి ఫలితాలుంటాయి.. కెఫిన్ తో పాటు కాఫీలో 1000 కంటే ఎక్కువ రసాయనాలున్నాయి. శరీరం కెఫీన్ ను జీర్ణం చేసేప్పుడు అది పారక్సంథైన్ అనే రసాయనాన్ని తయారు చేస్తుంది. ఇది ఫైబ్రోసిస్ లో చేరి Scar tissue పెరుగుదలను తగ్గిస్తుంది. ఇది కాలేయ క్యాన్సర్, ఆల్కహాల్ సంబంధిత సిర్రోసిస్, కొలెస్ట్రాల్ కాలేయ వ్యాధిని హైపటైటిస్ సితో పోరాడేందుకు సహాయపడుతుంది.


Sleep Changes: మహిళల్లో నిద్ర లేమి సమస్యలు ఎందుకు వస్తాయంటే..!

కాఫీ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి సమస్య తీవ్రత తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాఫీలోని కహ్వీల్, కెఫెస్టోల్, క్లోరోజెనిక్ యాసిడ్‌తో పాటు, పాలీఫినాల్స్, కెఫిన్, మిథైల్క్సాంథైన్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలుంటడం కారణంగా లివర్‌లో పేరుకున్న కొవ్వును ఈ కాఫీ చెక్ పెట్టేందుకు అవకాశం ఉంటుందట. అయితే సమస్య మరీ తీవ్రంగా ఉంటే మాత్రం తప్పక వైద్యుల సలహా పాటించాలి. అలాగే పచ్చని ఆకు కూరలు, బలమైన ఆహారం తప్పక తీసుకోవాలి.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 24 , 2024 | 12:27 PM