Share News

Health Tips : జిల్లేడు చెట్టుతో ఎన్ని ఉపయోగాలో తెలుసా.. దీని ప్రతి భాగం గొప్పగా పనిచేస్తుంది..!

ABN , Publish Date - Jun 13 , 2024 | 03:15 PM

ఆయుర్వేదంలో జిల్లేడు మొక్కలోని అన్ని భాగాలను ఔషధంగా వాడతారు. ఇందులోని లక్షణాలతో మలబద్ధకం, విరేచనాలు, కీళ్ల నొప్పులు, దంత సమస్యలు వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే అనేక రకాల వ్యాధులకు కూడా జిల్లేడు చెట్టు చెక్ పెడుతుంది.

Health Tips : జిల్లేడు చెట్టుతో ఎన్ని ఉపయోగాలో తెలుసా.. దీని ప్రతి భాగం గొప్పగా పనిచేస్తుంది..!
jilledu tree

జిల్లేడు మొక్కను ఎక్కువగా పట్టించుకోం కానీ ఇందులో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయి. దేవుడి మెడలో ఈ పూలను మాలగా వేస్తుంటాం. ముఖ్యంగా వినాయకుడి పూజలో ఉపయోగిస్తాం. అలాగే జిల్లేడు ఆకులు, వేర్లు, పూలు, విత్తనాలను ఆయుర్వేదంలో ఔషధంగా వాడుతూ ఉంటారు. జిల్లేడు ఎలాంటి సమస్యలకు చెక్ పెడుతుంది. తెలుసుకుందాం.

ఆయుర్వేదంలో జిల్లేడు మొక్కలోని అన్ని భాగాలను ఔషధంగా వాడతారు. ఇందులోని లక్షణాలతో మలబద్ధకం, విరేచనాలు, కీళ్ల నొప్పులు, దంత సమస్యలు వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే అనేక రకాల వ్యాధులకు కూడా జిల్లేడు చెట్టు చెక్ పెడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గాయాలను త్వరగా నయం చేస్తాయి. మెత్తగా రుబ్బి తీసిన ఆకుల రసాన్ని ఒంటి మీద వాపులపై రాస్తే ఉపశమనం ఉంటుంది.

ఈ మొక్కలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఈ జిల్లేడు ఆకులతో తలనొప్పి ఇట్టే తగ్గుతుంది. ఈ ఆకుల పేస్ట్ ని నుదిటి మీద వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఫైల్స్ తో బాధపడే వారికి ఈ చెట్టు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


Health Tips : రోజులో శరీరానికి చక్కెర ఎంత వరకూ అవసరం? అతిగా వాడితే ఏమౌతుందంటే..!

మధుమేహానికి కూడా జిల్లేడు మంచి ఔషధంగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.

వేరు పొడవుగా ఉంటుంది. చెట్టు నుంచి తెల్లని పాలు వస్తాయి. ఈ పాలలో విష పదార్థాలుంటాయి. అందరికీ పడకపోవచ్చు.

లేత జిల్లేడు చిగుళ్లను తాటి బెల్లంతో కలిపి చిన్న మాత్రలుగా చేసుకుని ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల పిరియడ్స్ నొప్పులు తగ్గుతాయి.

పేగులలో ఉండే పుండ్లు తగ్గడానికి జిల్లేడును ఉపయోగిస్తారు. నరాల బలహీనతకు అస్తమాకి, రక్త ప్రసరణ సజావుగా జరిగేందుకు దీనినే ఉపయోగిస్తారు.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 13 , 2024 | 03:15 PM