Share News

Heart Problem : గుండె పోటు రాబోతుందని శరీరం ముందే చెబుతుందా..!

ABN , Publish Date - Jul 17 , 2024 | 03:58 PM

శరీరం బరువు ఇట్టే పెరిగినపుడు మనం తెలుసుకుంటూనే ఉంటాం. కానీ పట్టించుకోం. ఇలా జరిగినా కూడా అనుమానించాల్సిందే. ఈ లక్షణం కూడా గుండె జబ్బుకు కారణం కావచ్చు.

Heart Problem : గుండె పోటు రాబోతుందని శరీరం ముందే చెబుతుందా..!
Heart Problem

గుండెపోటు అగస్మాత్తుగా ఎందుకు వస్తుందో వచ్చి, అతలాకుతలం చేసి పరేస్తున్నగుండె శరీరంలో ప్రధాన అవయవం. దీనికి ఇబ్బంది కలిగితే మనుగడ కష్టమే. గుండెకు ప్రమాదం కలగబోతుందని ముందుగానే హెచ్చరికలు చేస్తుందా? ఈ సంకేతాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ లక్షణాలను ముందుగానే గుర్తంచాల్సి ఉంటుంది. ఈ లక్షణాలలో దేనినైనా గుర్తిస్తే వైద్య సహాయం తక్షణమే అందేటట్లు చేయవచ్చు. ఆ సంకేతాలు ఎలా ఉంటాయంటే..

అలసట..

అలసట అనేది శరీరానికి అలవాటైన పరిస్థితే అయితే శరీరం బలహీనత స్థితిలో ఉండటం, శరీరం నిద్ర కోరుకునే స్థితి, తక్కువ శక్తి, బలం కలిగి ఉండటం. తరచుగా అలసిపోవడం, మరీ ఎక్కువగా ఇలా అనిపిస్తే కనుక ఇది కార్డియాక్ అరెస్ట్ అనే హెచ్చరిక కావచ్చు.


Cardamom Tea : నోటి దుర్వాసనకు చెక్ పెట్టే యాలకులు.. ఈ టీ తాగితే..!

అపస్మారక స్థితి..

ఖచ్చితంగా ఈ పరిస్థితి గుండె జబ్బులకు హెచ్చరిక కావచ్చు. విపరీతమైన శారీరక శ్రమ, నొప్పి, డిహైడ్రేషన్ అనేక కారణాల వల్ల అపస్మారక స్థితి ఏర్పడుతుంది. మెదడులో రక్తం లేకపోవడం మూర్చకు దారితీయవచ్చు. రక్తపోటు తగ్గడంతో ప్రారంభమై రక్తంలో ఆక్సిజన్ కొరతకు కారణం అవుతుంది.

వేగంగా బరువు పెరగడం..

శరీరం బరువు ఇట్టే పెరిగినపుడు మనం తెలుసుకుంటూనే ఉంటాం కానీ ఇది గుండె జబ్బులకు సంబంధించి అనే ఆలోచన చేయం.. ఇలా జరిగినా కూడా అనుమానించాల్సిందే. ఈ లక్షణం కూడా గుండె జబ్బుకు కారణం కావచ్చు.

Jaiphal Water : జాజికాయ నీటిని తీసుకుంటే జీర్ణ సమస్యలు పరార్.. ట్రై చేసి చూడండి.


వికారం, ఆకలి లేకపోవడం..

అజీర్ణం, వికారం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు గుండె వైఫల్యానికి కారణం కావచ్చు. వీటిని జీర్ణ సమస్యలుగా అనుకుని పొరపాటు పడుతూ ఉంటాం. ఆందోళన చెందకుండా వెంటనే డాక్టర్ని కలవడం మంచిది.

చెమటలు పట్టడం..

చెమట పట్టడం అనేది అందరిలోనూ కనిపించే లక్షణమే.. కానీ తరచుగా చమట ఎక్కువగా అనిపిస్తూ ఉంటే కనుక దీనిని అనుమానించాల్సిందే. ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్, మెదడు వ్యాధులు, మందులు లేదా ఒత్తిడి వల్ల చల్లని చెమటలు సంభవిస్తాయి.

Over Thinking : మరీ ఆలోచిస్తే ఇబ్బంది తప్పదా.. ఆలోచన మానుకోవాలంటే.. !


తల తిరగడం..

తలతిరగడం అనేది మామూలుగా అనిపించే తలనొప్పిగా కొట్టిపారేస్తూ ఉంటాం. అసలు ఆలోచనకు కూడా ఇలా అనిపించదు. అస్తమానూ ఇలాంటి సమస్యను ఎదుర్కొంటుంటే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది.

నిద్రలేకపోవడం..

రాత్రిపూట నిద్ర లేకపోవడం ఇప్పటి రోజుల్లో కామన్ విషయంగానే చూస్తున్నాం. శరీరం ఇలాంటి చిన్న చిన్న సంకేతాలను ఇస్తుంది. చిన్న చిన్న కారణాలేకదా అని వదిలేయలేం. వెంటనే వైద్యుని సంప్రదించడం ముఖ్యం.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 17 , 2024 | 04:03 PM